iDreamPost

మూవీ లవర్స్​కు పండగ.. ఒక్కరోజే ఓటీటీలోకి 18 సినిమాలు!

  • Author singhj Updated - 07:13 AM, Fri - 8 September 23
  • Author singhj Updated - 07:13 AM, Fri - 8 September 23
మూవీ లవర్స్​కు పండగ.. ఒక్కరోజే ఓటీటీలోకి 18 సినిమాలు!

టాలీవుడ్​కు గత నెల పెద్దగా కలసిరాలేదు. ‘బెదురులంక 2012’ మూవీ తప్పితే మిగతా ఏ తెలుగు సినిమా కూడా హిట్ అనిపించుకోలేదు. ఆగస్టు నెల పూర్తిగా తలైవా రజినీకాంత్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆయన నటించిన ‘జైలర్’ మూవీ కోలీవుడ్​తో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా అదిరిపోయే వసూళ్లను సాధించింది. ఎలాగూ ఆగస్టు పోయింది కాబట్టి సెప్టెంబర్​పై టాలీవుడ్ ఫోకస్ పెడుతోంది. అయితే ఈ నెలలో విడుదల కావాల్సిన బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్​టైనర్ ‘సలార్’ రిలీజ్ పోస్ట్​పోన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రభాస్​ మూవీకి భయపడిన ఇతర చిత్రాల నిర్మాతలు.. ఇప్పుడు తమ సినిమాలను కాస్త ముందే తీసుకొస్తున్నారు.

ఈ వారం తెలుగు బాక్సాఫీస్ వద్ద ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమా రిలీజైంది. నవీన్ పొలిశెట్టి, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు పడ్డాయి. దీంతో కలెక్షన్స్ కూడా బాగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు ఇండియన్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కింగ్ ఖాన్ షారుక్ ‘జవాన్’ చిత్రం కూడా బిగ్​ స్క్రీన్స్​లోకి వచ్చేసింది. మాస్ మసాలా ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. షారుక్ ఖాతాలో మరో రూ.1,000 కోట్ల సినిమా పడిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

థియేటర్లలో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’తో పాటు ‘జవాన్’ ఫెంటాస్టిక్​గా రన్ అవుతుంటే.. ఓటీటీ ఆడియెన్స్​ను అలరించేందుకు మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్​లు రెడీ అయిపోయాయి. రేపు ఒక్కరోజే ఏకంగా 18 మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్​కు సిద్ధమైపోయాయి. వాటిలో ప్రధానంగా రజినీకాంత్ ‘జైలర్’ గురించి చెప్పుకోవాలి. డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచిన ఈ మూవీతో పాటు మరికొన్ని మూవీస్ కూడా చూడాల్సినవి ఉన్నాయి. అవి ఏంటంటే..

ప్రైమ్ వీడియో
జైలర్ – ఆల్రెడీ స్ట్రీమింగ్
హోసా దినాచారి – కన్నడ – ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది
సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ – ఇంగ్లీష్ మూవీ – సెప్టెంబర్ 8

ఆహా
ఫ్యామిలీ ధమాకా – రియాలిటీ సిరీస్ – సీజన్ 1
లవ్ – తమిళం చిత్రం – సెప్టెంబర్ 8

నెట్​ఫ్లిక్స్
స్పై ఆప్స్ – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్ – సెప్టెంబర్ 8
ఏ టైమ్ కాల్డ్ యూ – కొరియన్ సిరీస్ సీజన్ 1 – సెప్టెంబర్ 8
రోసా పెరల్స్ టేప్స్ – స్పానిష్ డాక్యుమెంటరీ – సెప్టెంబర్ 8
బర్నింగ్ బాడీ – స్పానిష్ వెబ్ సిరీస్ సీజన్ 1 – సెప్టెంబర్ 8
సెల్లింగ్ ది ఓసీ – ఇంగ్లీష్ రియాలిటీ సిరీస్ సీజన్ 2 – సెప్టెంబర్ 8
సోనిక్ ది హెడ్జ్​హాగ్ 2 – ఇంగ్లీష్ మూవీ – సెప్టెంబర్ 8

సోనీలివ్
టెన్ పౌండ్ పామ్స్ – ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 1 – సెప్టెంబర్ 8
లోఖీ ఛెల్లే – బెంగాలీ మూవీ- ఆల్రెడీ స్ట్రీమింగ్

హాట్​స్టార్
ఐ యామ్ గ్రూట్ – ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 2 – ఆల్రెడీ స్ట్రీమింగ్
ఇండియాస్ మెగా ఫెస్టివల్స్ సీజన్ 1 – ఆల్రెడీ స్ట్రీమింగ్
ది లిటిల్ మెర్మాయిడ్ – ఇంగ్లీష్ అండ్ హిందీ – ఆల్రెడీ స్ట్రీమింగ్
యే హే ప్లానెట్ ఇండియా – హిందీ డాక్యుమెంట్ సిరీస్ – సెప్టెంబర్ 8

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి