iDreamPost

OTT Releases This Week: OTT ఆడియెన్స్​ గెట్ రెడీ.. ఒక్క వారంలో 30 సినిమాలు రిలీజ్!

  • Published Dec 18, 2023 | 12:06 PMUpdated Dec 18, 2023 | 12:06 PM

ఓటీటీ ఆడియెన్స్​కు ఈ వారం పండగేనని చెప్పాలి. వాళ్లను ఎంటర్​టైన్ చేసేందుకు ఈ వారం భారీగా మూవీస్ వచ్చేస్తున్నాయి. ఏ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓటీటీ ఆడియెన్స్​కు ఈ వారం పండగేనని చెప్పాలి. వాళ్లను ఎంటర్​టైన్ చేసేందుకు ఈ వారం భారీగా మూవీస్ వచ్చేస్తున్నాయి. ఏ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 18, 2023 | 12:06 PMUpdated Dec 18, 2023 | 12:06 PM
OTT Releases This Week: OTT ఆడియెన్స్​ గెట్ రెడీ.. ఒక్క వారంలో 30 సినిమాలు రిలీజ్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. వాళ్లనూ ఊరిస్తూ వస్తున్న ‘సలార్’ మూవీ ఎట్టకేలకు రిలీజ్​కు రెడీ అయింది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా విడుదల కానుందీ ఫిల్మ్. ఎలాంటి ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ రిలీజ్​ లాంటి హడావుడి లేకుండా సైలెంట్​గా ‘సలార్​’ను తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే మూవీ టీమ్ హడావుడి చేయకున్నా బజ్ మాత్రం ఒక రేంజ్​లో ఉంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్​ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ‘సలార్’ను ఢీకొట్టేందుకు షారుక్ ఖాన్ ‘డంకీ’, హాలీవుడ్ మూవీ ‘ఆక్వామెన్ 2’ కూడా ఇదే వారాంతంలో థియేటర్లలోకి రానున్నాయి. అయితే బిగ్​స్క్రీన్స్​లోనే కాదు.. ఓటీటీల్లోనూ ఆడియెన్స్​ను అలరించేందుకు ఈ వారం చాలా సినిమాలు వస్తున్నాయి.

ఈ వారం ఏకంగా 30 వరకు మూవీస్, వెబ్​ సిరీస్​లు ఓటీటీల్లోకి విడుదల కానున్నాయి. ఇన్ని సినిమాలు వస్తున్నా వాటిల్లో ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’, ‘బార్బీ’, ‘ఆదికేశవ’ మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. అలాగే కొన్ని ఇతర భాషా చిత్రాలు కూడా ఆడియెన్స్​లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ వారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో విడుదల కానున్నాయో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్ ప్రైమ్

    • మిషన్ స్టార్ట్ ఏబీ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 19
    • ది ఏసెస్ (ఇండోనేషియన్ ఫిల్మ్) – డిసెంబర్ 21
    • సప్త సాగరాలు దాటి సైడ్-బీ (తెలుగు డబ్బింగ్ ఫిల్మ్) – డిసెంబర్ 22
    • డ్రై డే (హిందీ మూవీ) – డిసెంబర్ 22
    • సాల్ట్ బర్న్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – డిసెంబర్ 22

హాట్​స్టార్

    •  ఫలిమి (తెలుగు డబ్బింగ్ ఫిల్మ్) – డిసెంబర్ 18
    • బీటీఎస్ మాన్యుమెంట్స్: బియాంగ్ ది స్టార్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 20
    • పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 20
    • డ్రాగన్స్ ఆఫ్ వండర్ హ్యాచ్ (జపనీస్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 20
    • వాట్ ఇఫ్..?: సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 22

నెట్​ఫ్లిక్స్

    • ద రోప్ కర్స్ 3 (మాండరిన్ మూవీ) – డిసెంబరు 18
    • హలో ఘోస్ట్ (మాండరిన్ ఫిల్మ్) – డిసెంబరు 18
    • మాస్ట్రో (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 20
    • సిండీ లా రెజీనా: ది హై స్కూల్ ఇయర్స్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 20
    • ది టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 (పోలిష్ ఫిల్మ్) – డిసెంబరు 20
    • లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 21
    • అల్హమర్ హెచ్​ఏ (అరబిక్ చిత్రం) – డిసెంబరు 21
    • రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – డిసెంబరు 21
    • ఆదికేశవ (తెలుగు సినిమా) – డిసెంబరు 22
    • కర్రీ & సైనైడ్: ది జాలీ జోసెఫ్ కేస్ (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 22
    • కుయికో (తమిళ చిత్రం) – డిసెంబరు 22
    • యోంగ్‌సాంగ్ క్రియేచర్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 22
    • ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ (పోర్చుగీస్ ఫిల్మ్) – డిసెంబరు 24
    • పింక్ ఫాంగ్ సింగ్ – అలాంగ్ మూవీ 3: క్యాచ్ ది జింజర్ బ్రెడ్ మేన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 24

జియో సినిమా

    • బార్బీ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 21
    • హే కమీనీ (హిందీ ఫిల్మ్) – డిసెంబరు 22

లయన్స్ గేట్ ప్లే

    • ఫియర్ ది నైట్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 22

జీ5

    • అడి (మలయాళ చిత్రం) – డిసెంబరు 22
    • హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబరు 22

ఇదీ చదవండి: Samantha: మళ్లీ పెళ్లిపై దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సమంత!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి