Dharani
Anatomy of A Fall: ఆస్కార్ అవార్డుతో పాటు వంద అవార్డులు గెలుచుకున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒకటి తెలుగులో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు
Anatomy of A Fall: ఆస్కార్ అవార్డుతో పాటు వంద అవార్డులు గెలుచుకున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒకటి తెలుగులో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు
Dharani
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక.. ప్రేక్షకులు సినిమా చూసే దృష్టి కోణం మారింది. భాషతో సంబంధం లేకుండా.. అన్ని ఇండస్ట్రీల సినిమాలను వరుస పెట్టి చూస్తున్నారు మూవీ లవర్స్. ఓటీటీల వల్ల కేవలం మాతృభాషలోనే కాక ఇతర లాంగ్వేజ్‌లలో హిట్టు టాక్ తెచ్చుకున్న సినిమాలను చూసే అవకాశం దక్కింది. ఒక్క భాషలో హిట్టైతే అన్ని లాంగ్వేజ్‌లలో ఆ సినిమాను స్ట్రీమ్ చేస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఓ సూపర్ హిట్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఆస్కార్‌తో పాటు ఏకంగా 100 అవార్డులు గెలుచుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. ఆ వివరాలు..
ఆస్కార్ విన్నింగ్ మూవీ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఫ్రెంచ్ చిత్రం.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఫ్రెంచ్, ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అవార్డును గెలుచుకుంది. 96వ ఆస్కార్ అవార్డుల్లో ఈ సినిమా మొత్తం ఐదు విభాగాల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్ట, బెస్ట్ హీరోయిన్‌తో పాటు స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో నామినేషన్ దక్కించుకోగా.. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమా ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా అవార్డులను గెలుచుకున్నది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్, సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్, యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్‌తో పాలు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన ప్రతి చోట ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్‌గా అవార్డులను దక్కించుకుంది.
ఇక అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీలో సాండ్ర హల్లర్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది సాండ్ర హల్లర్. అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ మూవీకి గాను ఆమె ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందని అందరూ భావించారు. కానీ మిస్సయ్యింది. ఇక అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమా విషయానికి వస్తే..
సాండ్ర ఓ రచయిత. మంచుకొండల్లో తన కుటుంబంతో కలిసి ఒంటరిగా జీవిస్తుంటుంది. ఇక వోయిలర్ భర్త అనుమానస్పద రీతిలో కన్నుమూస్తాడు. ఆ ప్రాంతంలో సాండ్ర తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె ఈ హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తుంటారు. అసలు ఈ హత్య ఎవరు చేశారు.. ఈ నేరం నుంచి సాండ్ర ఎలా బయటపడింది అన్నదే ఈ మూవీ కథ.
మతిపోయే ట్విస్టులు, టర్న్‌లతో జస్టిన్ ట్రైట్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆరు మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 35 మిలియన్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఫ్రెంచ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఎన్నో అవార్డులు గెలిచిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమ్ అవుతుంది కనుక చక్కగా ఎంజాయ్ చేయండి.