iDreamPost

నిరుద్యోగులకు Paytm గుడ్ న్యూస్.. త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం త్వరలో 50 వేల మంది ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం త్వరలో 50 వేల మంది ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

నిరుద్యోగులకు Paytm గుడ్ న్యూస్.. త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ చెల్లింపుల వినియోగం పెరిగిపోయింది. ప్రతిఒక్కరు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల దగ్గర్నుంచి పెద్దమొత్తాల వరకు డిజిటల్ పేమెంట్ యాప్ ల ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఆన్ లైన్ చెల్లింపుల యాప్స్ లల్లో బాగా ప్రాచూర్యం పొందినవి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం. లక్షలాది కస్టమర్లను కలిగిన ఈ ఆన్ లైన్ చెల్లింపుల యాప్స్ ద్వారా రోజు కోట్ల పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే డిమాండ్ కు తగ్గట్టుగా సేవలను అందించేందుకు సిబ్బంది కూడా అవసరం. ఈ నేపథ్యంలో పేటీఎం నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందించింది. త్వరలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం 50 వేల మంది సేల్స్ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. సేల్స్ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా ఎక్కువ మంది వ్యాపారస్తులను తమ నెట్ వర్క్ లో జత చేసుకుంటామని అన్నారు. దీని ద్వారా కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమమం అవుతుందని తెలిపారు. ఆన్ లైన్ వెల్త్ మేనేజ్ మెంట్ సేవలను పునరుద్దరించాలని ఆలోచన చేస్తున్నట్లు పేటీఎం సీఈఓ తెలిపారు. అదే విధంగా ఆన్ లైన్ పద్దతిలో పెట్టుబడి పెట్టాలనే యువ కస్టమర్ల కోసం మనీ మేనేజ్ మెంట్ పథకాలను పేటీఎం సవరిస్తోందని ఆయన ఆన్నారు. ఎక్కువ మంది వ్యాపారులను పేటీఎంతో జత చేసుకునేందుకు 60 శాతం సేల్స్ ఫోర్స్ ను ప్రచారానికి వినియోగించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే 50 వేల మంది ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి