iDreamPost

ఈ జాబ్స్ అస్సలు వదలకండి.. రైల్వేలో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్

మీరు ఉద్యోగాలకోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు భారీ శుభవార్త. ఇండియన్ రైల్వేస్ 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ అర్హతలుండాలి.

మీరు ఉద్యోగాలకోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు భారీ శుభవార్త. ఇండియన్ రైల్వేస్ 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ అర్హతలుండాలి.

ఈ జాబ్స్ అస్సలు వదలకండి.. రైల్వేలో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి అవకాశం. ఏ నోటిఫికేషన్ ను వదిలినా దీన్ని మాత్రం అస్సలు వదలకండి. రైల్వేలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రైల్వే శాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మంచి వేతనంతో కూడిన ఈ జాబ్స్ ను మీరు సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 5696 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం రైల్వేశాఖ అధికారిక వెబ్ సైట్ ను https://indianrailways.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

అసిస్టెంట్‌ లోకో పైలట్‌ జాబ్స్ మొత్తం:

  • 5696

విద్యార్హతలు:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం:

  • ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ ఉంటుంది.

వయసు:

  • అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థలను కంప్యూటర్ ఆదారిత పరీక్ష, ఇంటర్య్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులందరు రూ. 500 ఫీజు చెల్లించాలి.SC/ST/ExSM/మహిళ/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలు/EBC అభ్యర్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభం:

  • 20-01-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 19-02-2024

రైల్వేశాఖ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి