iDreamPost

మే 27 – వినోదాల బొనాంజా

మే 27 – వినోదాల బొనాంజా

ఈ శుక్రవారం ఎఫ్3 థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ రిలీజుల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ ఎలా అయితే ఉంటారో ఓటిటి కంటెంట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నారు. అందుకే ఎవ్రి ఫ్రైడే రెండు వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. ఏమోస్తున్నాయో చూద్దాం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం(ashoka vanamlo arjuna kalyanam) ఆహా(AHA)లో స్ట్రీమింగ్ కానుంది. కొద్దోగొప్పో మంచి టాకే వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా ఆశించిన స్థాయికి వెళ్లలేకపోయిన లవ్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ డిజిటల్ లో వ్యూస్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ మధ్య కొంత వెనుకబడిన ఆహాకి ఇది మైలేజ్ తీసుకొస్తుందనే అంచనాలో ఉంది

తెలుగులో డిజాస్టర్ కొట్టిన కెఆర్కె(కన్మణి రాంబో కతిజ) డిస్నీ హాట్ స్టార్ లో ఒకేసారి తెలుగు తమిళంలో విడుదల కానుంది. హాళ్లలో మనవాళ్ళు పెద్దగా చూడలేకపోయారు. విజయ్ సేతుపతి సమంతా నయనతార కాంబినేషన్ కావడంతో స్మార్ట్ స్క్రీన్ పై రెస్పాన్స్ బాగుండే అవకాశం ఉంది. జాన్ అబ్రహం లేటెస్ట్ మూవీ ఎటాక్(ATTACK) జీ5(ZEE5)లో వస్తోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ యాక్షన్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ ఓసారి యాప్ లో చూసే కౌంట్ భారీగానే ఉంటుంది. బెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ లో ఒకటైన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 (stranger things season 4)నెట్ ఫ్లిక్స్ లో వస్తోంది. దీనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆ రోజు ఎక్కువ వ్యూస్ దీనికే వచ్చే అవకాశాలున్నాయి

ఇవి కాకుండా సోనీ లివ్(SonyLIV)లో నిర్మల్ పాఠక్ కి ఘర్ వాపసీ (Nirmal Pathak Ki Ghar Wapsi) , సేత్తుమాన్(sethuman)ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో తులసీదాస్ జూనియర్(Toolsidas Junior) విడుదల చేస్తున్నారు. జీ5లో ఫోరెన్సిక్ ని తీసుకొస్తారు. భాషలు ఎవరైనా చాలా మటుకు సబ్ టైటిల్స్ మల్టీ ఆడియోస్ తో వస్తున్నాయి కాబట్టి టైం ఉండాలే కానీ చూసేందుకు బోలెడు వినోదం ఓటిటిలో సిద్ధంగా ఉంది. ఇక ఎఫ్3 కాకుండా థియేటర్లలో వస్తున్న బాలీవుడ్ మూవ్ అనేక్. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ దేశభక్తి సినిమా మీద బజ్ బాగానే ఉంది. టాప్ గన్ మావరిక్ బుకింగ్స్ బాగున్నాయి. సో మే 27 తగినంత సమయం మీ చేతిలో ఉంటే చాలు బోర్ కొట్టే అవకాశమే లేని కొత్త రిలీజులు సందడి చేయబోతున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి