iDreamPost

ఓం భీమ్ బుష్ పైసా వసూల్.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

బ్రోచెవారెవురాతో ఫన్ క్రియేట్ చేసిన త్రియో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన తాజా చిత్రం ఓం భీమ్ బుష్. తొలి ఆట నుండే పాజిటివ్ రివ్యూస్ తో దూసుకెళ్లిపోయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

బ్రోచెవారెవురాతో ఫన్ క్రియేట్ చేసిన త్రియో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన తాజా చిత్రం ఓం భీమ్ బుష్. తొలి ఆట నుండే పాజిటివ్ రివ్యూస్ తో దూసుకెళ్లిపోయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..?

ఓం భీమ్ బుష్ పైసా వసూల్.. 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

‘బ్రోచెవారెవరురా’ తర్వాత శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా ఆసాంతం నవ్వులు పువ్వులు పూయిస్తూ.. హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, ఆదిత్య మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించిన ఓం భీమ్ బుష్ చిత్రాన్ని హుషారు, రౌడీ బాయ్స్ దర్శకుడు శ్రీ హర్ష కానుగంటి దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద జోరు చూపిస్తోంది. టీజర్, ట్రైలర్లతో పాటు ప్రమోషన్లు సినిమాపై అంచనాలు పెంచేసిన సంగతి విదితమే.

వి సెల్యూలాయిడ్ పాటు వీఆర్ గ్లోబల్ మీడియా బ్యానర్లపై ఈ చిత్రాన్ని సునీల్ బలుసు రూపొందించాడు. శ్రీ విష్ణు సినిమాల్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ థియేటర్లలో రిలీజైన ఈచిత్రంగా నిలిచిపోతుంది. భారీ ఓపెనింగ్స్‌తో వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక వీకెండ్‌లో ఓం భీమ్ బుష్ కలెక్షన్లు జోరందుకున్నాయి. రోజు రోజుకు సినిమా వసూళ్లు పెరిగాయి. శనివారం రూ. 6 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.44 కోట్లను రాబట్టుకుంది. ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ సంగీతం అందించాడు. ఆదివారం కూడా థియేటర్లు ఫుల్ అయిపోయాయి. షో.. షోకు ఆక్యుపెన్సీ పెరగడంతో సుమారు రూ. 7 కోట్లను వసూలు చేసింది.

మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 17 కోట్లను రాబట్టుకుంది. సుమారు 20 కోట్లను ఖర్చు పెట్టారని వినికిడి. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే.. మూడు కోట్లు మాత్రమే. ఈ వీకెండ్ లో ఈ మార్క్ చేరుకుని.. లాభాల వైపు పరుగులు పెట్టే అవకాశాలున్నాయి. ఇక ఇందులో రాహుల్ రామకృష్ణ స్పాంటినిటీ, సెటెర్లు, ప్రియదర్శి, శ్రీ విష్ణు నటన హైలెట్ గా నిలిచాయి. వీరు పండించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు అభిమానులు.. నో లాజిక్, నో మ్యాజిక్ అంటూ కట్టిపడేశారు. సెకండాఫ్‌లో ఎమోషనల్ టచ్ మూవీ లవర్స్‪ను కంటతడి పెట్టిస్తోంది. మొత్తానికి చిన్న సినిమా వచ్చి.. భారీ కలెక్షన్లను రాబట్టుకుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి