iDreamPost

EV మార్కెట్ డౌన్ అయినా.. OLA మాత్రం రికార్డులు సృష్టిచింది!

EV మార్కెట్ డౌన్ అయినా.. OLA మాత్రం రికార్డులు సృష్టిచింది!

ఒక నెల రోజుల నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ కాస్త డౌన్ ఫాల్ ని చూస్తోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వాటి ధర పెరగడమే. ఎందుకంటే కేంద్రం ఫేమ్ 2 రాయితీని తగ్గించగానే.. ఈవీల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఇంకా ప్రజల్లో ఈవీలపై గట్టి నమ్మకం కలగడం లేదు. ఇంకా ఇవి కాలిపోతాయి, పేలిపోతాయి అనే భయాల్లోనే ఉంటున్నారు. కానీ, ఇలాంటి ప్రతికూల సమయాల్లో కూడా ఓలా మాత్రం రికార్డులు సృష్టిస్తోంది.

నిజానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ మొత్తం భారీగా పడిపోయింది. అన్ని కంపెనీలు కూడా తమ సేల్స్ లో తగ్గుముఖం చూశారు. కానీ, ఓలా మాత్రం 2డబ్ల్యూ విభాగంలో మాత్రం అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. జూన్ నెలలో ఓలా దగ్గర దగ్గర 18,000 యూనిట్స్ అమ్మకం చేసింది. ఆ విభాగంలో అది నిజంగా అద్భుతమనే చెప్పాలి. అంతేకాకుండా ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో తోపాటుగా ఇప్పుడు ఓలా ఎయిర్ కూడా తోడవుతుండటంతో ఓలా అమ్మకాలను మరింత పెంచే అవకాశం లేకపోలేదు. జూన్ నెల అమ్మకాల్లో 40 శాతం షేర్ తో ఓలా వాహనాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

ఈ అమ్మకాల రికార్డులపై కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. “అమ్మకాలు స్లోగా ఉన్న నెలలో కూడా అద్భుతమైన అమ్మకాలు జరిగాయి. అందుకు మేము అందించే తక్కువ ధర, నాణ్యత, సప్లై చైన్ స్ట్రాంగ్ గా ఉండటం, స్వయంగా వాహనాలను తయారు చేయడం వంటి అంశాలను మమ్మల్ని మార్కెట్ లో నంబర్ వన్ గా కొనసాగేలా చేస్తున్నాయి” అంటూ చెప్పుకొచ్చారు. ఓలా ఇటీవలే తమ 750వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించింది. ఆగస్టు కల్లా 1000 ఎక్స్ పాన్షన్ సెంటర్లను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఓలా ఎస్ 1 ప్రో ధర రూ.1,39,000, 3KWH ఓలా ఎస్ 1 ధర రూ.1,29,999, ఓలా ఎయిర్ ధర రూ.1,09,999గా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి