iDreamPost

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Olaలో 25 వేల కొత్త జాబ్స్!

ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఓలాలో 25 వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కంపెనీ సీఈవో ప్రకటించారు.

ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఓలాలో 25 వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కంపెనీ సీఈవో ప్రకటించారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. Olaలో 25 వేల కొత్త జాబ్స్!

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలాకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు అద్భుతమైన ఫీచర్లతో రకరకాల మోడళ్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఈవీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్ లో కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ వాహనరంగంలో దూసుకెళ్తున్న ఓలా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఓలాలో 25 వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కంపెనీ సీఈవో ప్రకటించారు. వాహనాల ఉత్పత్తిని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌లో ఓలా కంపెనీ కో-ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో సుమారు 25 వేల కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓలా న్యూ ఈవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మిస్తున్నారు. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే సుమారు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని భవిష్ అగర్వాల్ తెలిపారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ `ఈవీ హబ్‌` విస్తరించి ఉన్నది. స్కూటర్ల ఉత్పత్తితోపాటు సప్లయర్ నెట్‌వర్క్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

తమిళనాడులో నిర్మిస్తున్న ఓలా ఈవీ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ.. దేశంలోనే తొలి గిగా ఫ్యాక్టరీగా నిలుస్తుందని భవిష్ అగర్వాల్ వెల్లడించారు. ఈ యూనిట్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఏటా సుమారు ఒక కోటికిపైగా టూ వీలర్స్ ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్పాదక యూనిట్ కోసం గతేడాది తమిళనాడు ప్రభుత్వంతో ఓలా ఎలక్ట్రిక్.. అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)కుదుర్చుకుంది. ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఓలా ఎలక్ట్రిక్ రూ.7000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నది. మరి ఓలాలో త్వరలో 25 వేల ఉద్యోగాలు రానుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి