iDreamPost

రూ.100 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి.. హైకోర్టు షాకింగ్ తీర్పు!

రూ.100 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి.. హైకోర్టు షాకింగ్ తీర్పు!

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని జరగాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. కానీ నేటి రోజుల్లో పరిస్థితులు మారాయి.. లంచగొండి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేస్తోంది ఏసీబీ. ఈ మధ్యకాలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడిన ఘటనలు చాలానే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదే రీతిలో ఓ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ సర్టిఫికేట్ కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రూ. 100 లంచం తీసుకుని ఏసీబీకి దొరికిపోయాడు. డాక్టర్ ను అరెస్టు చేసి స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా విచారణ జరిపిన కోర్టు.. నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా.. 16 ఏళ్ల తర్వాత బాంబే హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్ర పూణే జిల్లాలోని ఫౌడ్ గ్రామంలో ఉన్న గ్రామీణ ఆస్పత్రిలో వైద్యాధికారిగా డాక్టర్ అనిల్ షిండే పని చేసేవారు. అదే గ్రామానికి చెందిన ఎల్టీ పింగళే అనే వ్యక్తి తన మేనల్లుడు చేసిన దాడిలో గాయపడగా ఆ గాయాలను ధృవీకరించడానికి డాక్టర్ సర్టిఫికేట్ కోసం డాక్టర్ అనిల్ షిండే దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో డాక్టర్ అనిల్ షిండే.. రూ. 100 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఎల్టీ పింగళే ఆరోపించాడు. అయితే ఈ విషయంపై ఏసీబీ అధికారులకు ఎల్టీ పింగళే ఫిర్యాదు చేయగా డాక్టర్ అనిల్ షిండే డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన 2007లో చోటుచేసుకుంది. కాగా తాజాగా నిందితుడిని బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2007 లో లంచంగా రూ.100 తీసుకోవడం చాలా చిన్న విషయమని.. వైద్యాధికారిని నిర్దోషిగా విడుదల చేస్తూ కీలక తీర్పు చెప్పింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన జస్టిస్ జితేంద్ర జైన్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి