iDreamPost

ధోని, సంగక్కర వల్ల కానిది.. డికాక్ చేసి చూపించాడు!

  • Author singhj Published - 12:39 PM, Fri - 13 October 23
  • Author singhj Published - 12:39 PM, Fri - 13 October 23
ధోని, సంగక్కర వల్ల కానిది.. డికాక్ చేసి చూపించాడు!

వన్డే వరల్డ్ కప్​-2023 సౌతాఫ్రికా టీమ్ అదరగొడుతోంది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఈ జట్టుపై ఎవరికీ పెద్దగా ఎక్స్​పెక్టేషన్స్ లేవు. సెమీస్​కు చేరే ఫేవరెట్స్ లిస్టులో చాలా మంది వెటరన్ క్రికెటర్లు సౌతాఫ్రికాకు చోటివ్వలేదు. సెమీఫైనల్​కు ఈ టీమ్ చేరడం కష్టమేనని కామెంట్స్ చేశారు. కానీ ఆ జట్టు అంచనాలకు మించి ఆడుతోంది. ఫస్ట్ మ్యాచులో శ్రీలంకను చిత్తు చేసిన సఫారీలు.. రెండో మ్యాచ్​లో ఆస్ట్రేలియాను మట్టికరిపించారు. వరుసగా రెండు మ్యాచుల్లో భారీ విజయాలతో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది సౌతాఫ్రికా. శ్రీలంకతో తొలి మ్యాచ్​లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఏకంగా ముగ్గురు ప్లేయర్లు సెంచరీల మోత మోగించడంతో ఆ జట్టు 428 పరుగుల భారీ స్కోరు సాధించింది.

లంకపై ఓపెనర్ క్వింటన్ డికాక్​తో పాటు ఎయిడెన్ మార్క్​రమ్, వాండర్ డస్సెన్​లు సెంచరీలు సాధించారు. ఫస్ట్ మ్యాచ్​లో శతకం బాదిన డికాక్ ఆసీస్​ మీదా మూడంకెల స్కోరును రీచ్ అయ్యాడు. తొలి మ్యాచ్​లో 100 రన్స్, సెకండ్ మ్యాచ్​లో 109 రన్స్ చేసిన డికాక్.. ఈ వరల్డ్ కప్​ తనదే అంటున్నాడు. అయితే కంగారూ టీమ్​పై సెంచరీతో అతడో స్పెషల్ ఫీట్​ను సాధించాడు. వరల్డ్ కప్​లో ఆస్ట్రేలియా మీద అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్​మన్​గా క్వింటన్ డికాక్ నిలిచాడు. ఇంతకుముందు లంక లెజెండ్ కుమార్ సంగక్కర పేరుపై ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. 2015 వరల్డ్ కప్​లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆసీస్​పై సంగక్కర 104 రన్స్ చేశాడు. లక్నో మ్యాచ్​లో కంగారూ టీమ్​పై 109 రన్స్ చేసిన డికాక్.. సంగక్కర రికార్డును అధిగమించాడు.

ప్రపంచ కప్ టోర్నీలో ఆసీస్​పై సెంచరీలు బాదిన వికెట్ కీపర్ల లిస్టులో డికాక్, సంగక్కరతో పాటు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ కూడా ఉన్నాడు. అయితే ఈ వరల్డ్ కప్​లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడిన ఫస్ట్ మ్యాచ్​లో వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ కేఎల్ రాహుల్ (97 నాటౌట్) సెంచరీకి దగ్గరగా వచ్చి కొద్దిలో మిస్సయ్యాడు. ఆసీస్​ఫై ఈ ఘనత సాధించడంలో టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఫెయిలయ్యాడు. 2019 వరల్డ్ కప్​లో కంగారూలపై 65 రన్స్ చేశాడు ధోని. మెగా టోర్నీలో ఆ టీమ్​పై ధోనీకి ఇదే బెస్ట్ స్కోరు. మరి.. ధోనీకి సాధ్యం కాని రికార్డును డికాక్ సాధించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండో-పాక్ మ్యాచ్.. ఆ స్టార్ సింగర్ సహా ఆడిపాడనున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి