iDreamPost

ఇంట్లో కూడా ఇలాంటి రుచికరమైన ఆహారం లభించదేమో…

ఇంట్లో కూడా ఇలాంటి రుచికరమైన ఆహారం లభించదేమో…

ప్రభుత్వ క్వారెంటయిన్ కేంద్రానికి వెళ్లాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు.. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, శుభ్రమైన వాతావరణం ఉంటుందో లేదో, రుచికరమైన, శుచికరమైన భోజనం లభిస్తుందో లేదో అని ఎన్నో అనుమానాలు ఉంటాయి..అందుకే కరోనా లక్షణాలు ఉన్నా కొందరు క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్ళడానికి భయపడిపోతున్నారు..  కానీ అలాంటి అనుమానాలు పటాపంచలు చేస్తూ అత్యంత పోషకవిలువలతో కూడిన భోజనం పెడుతాం రండని సోషల్ మీడియాలో ప్రకటన ఇస్తున్నారు కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అనుపమ అంజలి..

ఇమ్యూనిటీని పెంచేవిధంగా పూర్తి స్థాయి పోషకాలు అందే ఆహారాన్ని క్వారెంటయిన్ కేంద్రాలకు వచ్చేవారికి అందిస్తామని అంజలి అనుపమ తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇమ్యూనిటీ సిస్టంని పెంచే విధంగా మంచి రుచికరమైన డైట్ ని సిద్ధం చేసినట్లు అక్కడి క్వారెంటయిన్ సెంటర్లలో ఆహారాన్ని గమనిస్తే అర్థం అవుతుంది..

బాదం,గుడ్లు, డ్రై ఫ్రూట్స్ స్వీట్స్,సమోసాలని డైట్ చేర్చగా  ఇడ్లి,గారెలను అల్పాహారంగా అందిస్తున్నారు. పప్పు,అన్నం,పచ్చడి మెనులో చేర్చారు..ఇలాంటి ఆరోగ్యకరమైన డైట్ అందించడంతో శరీరంలో ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుందని వైద్య నిపుణులు  చెబుతున్నారు..కాబట్టి ఏ ఒక్కరు భయపడకుండా ఏవైనా అనారోగ్య లక్షణాలు ఉంటే క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు..

ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం కోసమైనా క్వారెంటయిన్ సెంటర్లకి వెళ్లాలనిపిస్తుందని పలువురు వ్యాఖ్యానించడం విశేషం..

ప్రభుత్వం ప్రజలకోసం చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి క్వారెంటయిన్ కేంద్రాలంటే అపరిశుభ్రంగా ఉంటాయనో లేక సరైన భోజనం పెట్టరనే  సందేహాలను పక్కనబెట్టి క్వారెంటయిన్ కేంద్రాలకు ధైర్యంగా రావాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైన కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం..కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారు క్వారెంటయిన్ కేంద్రాలకు వెళ్లి పూర్తి ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలని వైద్య నిపుణులు అధికారులు చెబుతున్నారు.

ఇంట్లో కూడా మనిషిలో ఇమ్యూనిటీని పెంచే ఇంత రుచికరమైన పోషకాహారం లభించదేమో కానీ ప్రభుత్వం నెలకొల్పిన క్వారెంటయిన్ కేంద్రాలలో అత్యంత పోషకాలు లభించే ఆహారం లభిస్తుందని కాబట్టి అనుమానిత లక్షణాలు ఉన్నవాళ్లు భయాన్ని వదిలి క్వారెంటయిన్ కేంద్రాలకు రావాలని అధికారులతో పాటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి