iDreamPost

లోకేష్‌.. అప్పుడు పడవలన్నారు మరి ఇప్పుడేమంటారు?

లోకేష్‌.. అప్పుడు పడవలన్నారు మరి ఇప్పుడేమంటారు?

తెలుగుదేశం పార్టీ జాయతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఎప్పుడూ అంతే.. ఆయనేదో చెబుదామనుకుంటారు.. ఇంకేదో చెబుతారు.. ఆఖరికి అది చేటంత అవుతుంది. సరిగ్గా గతేడాది కృష్ణా నదికి వరదలొచ్చినప్పుడు కూడా మహాద్భుతమైన ఓ మాట చెప్పారు. బ్యారేజీ గేట్లకు వైఎస్సార్‌సీపీ నాయకులు పడవలు అడ్డుపెట్టి వరద నీటిని తాముండే కరకట్ట ఇంటివైపు మళ్ళించేసారు. అందువల్లే ఇంట్లోకి వరదనీరు వచ్చేసింది.. సరిగ్గా ఇంతకు ముందు వరదల సమయంలో లోకేష్‌ చెప్పిన మాటలివి.

అయితే ఈ సారి ఎవరు, ఏం అడ్డుపెట్టారని కృష్ణమ్మ మళ్ళీ కరకట్ట ఇంట్లోకొచ్చిందో ఈ సారి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లోకేష్‌కు ఏర్పడింది. ఓరినాయనో బ్యారేజీలకు బ్యారేజీలే వరద నీటిని పాలేకపోతున్నాయి.. ఇక పడవలతో నీటిని ఎలా మళ్ళిస్తామయ్యా.. అంటూ అప్పట్లోనే కొందరు వైఎస్సార్‌సీపీ నాయకులు తలలు కొట్టుకున్నారు. అయినప్పటికీ లోకేష్‌.. తన మాటమీదే నిలబడ్డారు అప్పట్లో.

Also Read: నాడు రాజధానికి విరాళం అన్నాడు, నేడు నష్టం అంటూ కోర్టుకెక్కాడు.. బడా సినీ నిర్మాత వ్యవహారం

సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు అడిగేద్దామని మీడియా ఎదురు చూస్తున్నప్పటికీ లోకేష్‌ మాత్రం ట్విట్టర్‌ను వీడిప్రత్యక్షంగా కన్పించడం లేదాయె. పోనీ ట్విట్టర్‌లోనైనా ఏదో ఒకటి కామెంట్‌ అయినా చేసారా? అంటే అదీ లేదు. ప్రస్తుతం పిన్‌డ్రాప్‌ సైలెంట్‌ మోడల్‌లోనే చినబాబు ఉండిపోయారు.

అయితే జనం మాత్రం గతంలో వరదలు వచ్చినప్పుడు బాబు చెప్పిన మాటలు, ఇప్పుడు పరిస్థితిని బేరీజు వేసి చినబాబుపై జాలి చూపిస్తున్నారు. ఆయనకు ఫీడ్‌ ఇచ్చే వాళ్ళైనా సక్రమంగా ఇవ్వండర్రా.. పాపం పార్టీ ఆయనపై చాలానే ఆశలు పెట్టుకుంది.. అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కృష్ణా నదికి వరదలు వస్తే రాజధాని ప్రాంతం నీటమునుగుతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎప్పట్నుంచో మొత్తుకుంటున్నారు. కానీ అవన్నీ ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలంటూ చంద్రబాబు, లోకేష్‌ల బృందం మాయచేసే ప్రయత్నం చేసారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌గానీ, పర్యావరణవేత్తలుగానీ, ఇక్కడ పరిశీలనలు చేసిన పలు యూనివర్శిటీలు గానీ వరద ప్రభావం ఉన్న ప్రాంతంలో రాజధాని అద్దు అని తేల్చారు. కానీ చంద్రబాబు అండ్‌ కంపెనీ పట్టించుకున్న దాఖలాల్లేవు.

Also Read: జగన్‌ హాయంలో వరద బాధితుడుగా మారిన చంద్రబాబు

కానీ ప్రకృతి ముందు వారి మాయలు ముందుకు సాగలేదనే చెప్పాలి. కృష్ణమ్మ వరద ఉధృతికి వాగులు పొంగుకొచ్చి భారీగా కట్టిన రిటైల్‌వాల్‌ను కూడా అధిగమించి జనావాసాల్లోకి వరదనీరు వచ్చిపడిపోయింది. ఇంతకు ముందు పడవల కథ ఇప్పుడు మళ్ళీ చెబితే ఇప్పటికే ఓ సారి నవ్వేసుకున్న జనం మళ్ళీ నవ్వుతారు. అంచేత దీన్ని పక్కనెట్టి మరో మెట్ట వాదనేదో లోకేష్‌ అండ్‌ బృందం అందుకోవాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి