iDreamPost

చిల్లరతో నామినేషన్..తలలు పట్టుకున్న అధికారులు

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా ఎన్నికలు అనగా.. చిత్ర, విచిత్ర విన్యాసాలు జరుగుతుంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు.. వింత వింత పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఓ అభ్యర్థి మాత్రం అధికారులకు చుక్కలు చూపించాడు.

తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా ఎన్నికలు అనగా.. చిత్ర, విచిత్ర విన్యాసాలు జరుగుతుంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు.. వింత వింత పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఓ అభ్యర్థి మాత్రం అధికారులకు చుక్కలు చూపించాడు.

చిల్లరతో నామినేషన్..తలలు పట్టుకున్న అధికారులు

ఇటీవల ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో మధ్యప్రదేశ్‌లో మాత్రమే బీజెపీ అధికారంలో ఉంది. చత్తీస్ గఢ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి విదితమే. తెలంగాణలో స్థానిక బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ చాలా కీలకంగా మారాయి కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వానికి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారాలు మొదలు పెట్టేశాయి పార్టీలు. ఇదే సమయంలో వింత వింత సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, అధికారులకు పరీక్ష పెడుతున్నారు.

నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆ ఫారమ్ కోసం అభ్యర్థులు.. నోట్లను కాదూ.. చిల్లర కుమ్మరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. చేసేదేమీ లేక లెక్కగడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి పది వేలు రూపాయల చిల్లరను తీసుకువచ్చి.. అధికారులకు సహనానికి పరీక్ష పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న ఒకే దశలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నామినేషన్లకు గడువు అక్టోబర్ 21 నుండి 30 వరకు మాత్రమే ఉంది. ఈ పది రోజుల్లో కూడా  దసరా, నాల్గవ శనివారం, సండేలు రావడంతో అభ్యర్థులు.. నామినేషన్లు వేసేందుకు పరుగులు పెడుతున్నారు.

కట్ని జిల్లా ముద్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు న్యాయవాది సందీప్ నాయక్. జనతాదళ్ యునైటెడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ ఫారం తీసుకునేందుకు సంచిలో నాణాలు వేసుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి.. చిల్లర కుమ్మరించాడు. ఆ చిల్లరను చూసిన అధికారులు షాక్ కు గరయ్యారు. చేసేదేమీ లేక.. నాలుగు గంటల పాటు లెక్కించారు. అవన్నీ కూడా రూపాయిలేనని సమాచారం. మొత్తానికి అవి లెక్కించగా.. రూ. 10 వేలు ఉన్నట్లు తేలడంతో.. సందీప్ నాయక్ కు నామినేషన్ ఫారం ఇచ్చి.. ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటీవల ఓ స్వతంత్ర అభ్యర్థి రూ. 10వేల చిల్లర తెచ్చి..అధికారులను ఇబ్బందులకు గురి చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి