iDreamPost

Acharya : ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా ఎప్పుడో

Acharya :  ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా ఎప్పుడో

ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ సైరా తర్వాత దాదాపు మూడేళ్ళకు పైగా నిర్మాణంలోనే ఉన్న ఆచార్య విడుదలకి అడ్డంకులు తొలగిపోలేనట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లో రావాలని గట్టిగా అనుకున్నారు. కానీ పుష్ప కోసం త్యాగం చేశారు. తీరా చూస్తే అది ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక్కడ హిట్ అవ్వడంలో విశేషం లేదు కానీ నార్త్ లో తెగ ఆడేసి ఐకాన్ స్టార్ కి ఓ మార్కెట్ ని సృష్టించింది. ఆర్ఆర్ఆర్ ఉంది కదాని జనవరిని నిర్లక్ష్యం చేశారు. దెబ్బకు ఆచార్య ఫస్ట్ కాపీ సిద్ధం కాలేదు. ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాగా బంగార్రాజు ఒకటే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. మిగిలినవి టాక్ మీద ఆధారపడినవి.

సరే అయిందేదో అయ్యింది ఫిబ్రవరి 4 లాక్ చేసుకున్నాం కదాని కొణిదెల సంస్థ నిశ్చింతగా ఉండడానికి లేదు. రాజమౌళితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాకే ఆచార్య రావాలి. ఒకవేళ జక్కన్న పెద్ద మనసు చేసుకుని ఓకే ప్రొసీడ్ అంటే పర్లేదు ఒక ఛాన్స్ దక్కుతుంది. ఇది జరిగినా జరగకపోయినా ఏపిలో ఈ నెల 31 దాకా 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూలు అమలులోకి వచ్చాయి. తర్వాత పొడిగించరన్న గ్యారెంటీ లేదు. అలా అయితే ఆచార్య 4 రావడం కష్టం. దీనికి తోడు టికెట్ రేట్ల మీద కోర్టు హియరింగ్ ఫిబ్రవరి 10న ఉంది. ఆలోగా ఆచార్య రిలీజ్ చేస్తే పాత రేట్లకే టికెట్లను అమ్మాల్సి ఉంటుంది. దీనికి నిర్మాతలు సిద్ధంగా ఉండకపోవచ్చు.

ఇవన్నీ చూస్తుంటే ఆచార్య ఓ అంతులేని కథగా తోస్తోంది. చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్, ఫెయిల్యూర్ లేని కొరటాల శివ దర్శకత్వం, మణిశర్మ సంగీతం, పూజా హెగ్డే గ్లామర్, కోట్లాది రూపాయల బడ్జెట్ ఇన్ని సానుకూలతలు ఉన్నా కూడా ఆచార్య ఆశించిన స్థాయిలో బజ్ ని పెంచుకోలేకపోతోంది. మూడు పాటలు వచ్చాయి. మిలియన్ల వ్యూస్ వచ్చాయి కానీ దేశమంతా మాట్లాడుకునే ఛార్ట్ బస్టర్స్ అయితే కాలేదు. పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటూ వచ్చారు కానీ పుష్ప తరహాలో కనీసం ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ పాటలు కూడా విడుదల చేయలేదు. మరి ఆచార్యకు మోక్షం దక్కేదెప్పుడో, ఫ్యాన్స్ సంబరపడేది ఎన్నడో

Also Read : Bangarraju Trailer : ఇద్దరు బంగార్రాజుల సంక్రాంతి సందడి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి