iDreamPost

టెంప్ట్ చేసే ఆఫర్ – అయినా ఇరకాటం

టెంప్ట్ చేసే ఆఫర్ – అయినా ఇరకాటం

న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా టక్ జగదీశ్ విడుదల గురించి ఎలాంటి సమాచారం రావడం లేదు. అదిగో ఇదుగో అంటున్నారే తప్ప ఫలానా టైంలో ఉండొచ్చని కనీసం క్లూ కూడా ఇవ్వడం లేదు. దీనికి భారీ ఓటిటి ఆఫర్ వచ్చిందని సుమారు 40 కోట్లకు పైగా టెంప్ట్ చేసే ప్రతిపాదనతో ఓ సంస్థ ఊరిస్తోందని ఫిలిం నగర్ లో జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలకు ఇది మంచి డీల్ గా అనిపిస్తున్నప్పటికీ ఆల్రెడీ వితో ఒక డైరెక్ట్ ఓటిటి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న నాని దీనికి ససేమిరా అంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకొంత కాలం వేచి చూద్దామని సర్దిచెబుతున్నట్టు అంతర్గతంగా వస్తున్న సమాచారం.

Also Read: రాజమౌళి కీరవాణిల మ్యూజిక్ స్కెచ్

ఒకవేళ ఇది నిజమనుకుంటే టక్ జగదీశ్ నలభై కోట్ల షేర్ రాబట్టడానికి ఎంత లేదన్నా 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం. బాహుబలి రేంజ్ టాక్ వస్తే తప్ప ఈ ఫీట్ ని చేరుకోలేదు. పైగా ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ అండ చాలా కీలకం. అయితే థర్డ్ వేవ్ భయాల మధ్య కుటుంబ జనాలు ఏ మేరకు థియేటర్ల దాకా వస్తారో చెప్పడం కష్టంగానే ఉంది. అందుకే ఇదంతా ఎందుకు లెమ్మని డిజిటల్ కు ఓకే చెబుదామా అంటే హీరోతో పేచీ. ఈ గందరగోళం వల్లే కనీసం కొత్త పోస్టర్ లాంటి అప్ డేట్ కూడా టక్ జగదీశ్ టీమ్ నుంచి రావడం లేదన్నది వాస్తవం.

ఆగస్ట్ వద్దనుకుంటే సెప్టెంబర్ ఇంకా లేట్ అయిపోతుంది. మిగిలిన పెద్ద సినిమాలు అప్పుడు వచ్చేలా కొన్ని ప్లాన్ చేసుకున్నాయి. కరోనా వచ్చాక వీలైనంత పోటీ లేకుండా రిలీజ్ చేసుకుంటేనే రెవిన్యూ పరంగా ఏ నిర్మాతైనా సేఫ్ అవుతాడు. మరి టక్ జగదీష్ ఎదురుకుంటున్న ఈ ఇరకాటం చిన్నది కాదు. ఇంకా ట్రైలర్ రిలీజ్ కూడా జరగలేదు. ఒకవేళ ఓటిటి అనుకుంటే సదరు సంస్థ చేయాలి తప్ప ప్రొడ్యూసర్ కు ఆ ఆప్షన్ ఉండదు. లేదు ఆరు నూరైనా ఎంత లేట్ అయినా థియేటర్లకే టక్ జగదీశ్ వస్తాడా లేక వెంకటేష్ నారప్ప రూటు పడతాడా వేచి చూడాలి. ఇదెప్పుడు తేలుతుందో అని నాని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు

Also Read: ఆ ఇద్దరికీ భలే లక్కీ ఛాన్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి