iDreamPost

బలహీనపడిన అ‍ల్పపీడనం.. భారీ వానలు ఇక లేనట్లే..

బలహీనపడిన అ‍ల్పపీడనం.. భారీ వానలు ఇక లేనట్లే..

గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడ తెరపిలేకుండా కురుస్తున్న భారీ వానలకు బ్రేక్‌ పడింది. అల్పపీడనం బలహీనపడటం వల్ల ఇకపై భారీ వర్షాలు పడకపోవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాదు! రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్‌ ట్విటర్‌ ఖాతా పేర్కొంది.

ఈ రోజునుంచి తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం సాధారణంగా మారుతుందని తెలిపింది. అయితే, గత రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా మరో రెండు రోజులు వరద ముప్పు ఉందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అంది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని ప్రకటించింది. ఇక, హైదరాబాద్‌లో వర్షాల బెడద ఇకపై ఉండదని, సాధారణ రోజులు వస్తాయని తెలిపింది. ఈ రోజు సూర్యుడు పైకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

అయినప్పటికి మబ్బులు ఉంటాయని వెల్లడించింది. ఒకవేళ వర్షాలు పడ్డా.. కేవలం జల్లులు మాత్రమే పడతాయని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని స్పస్టం చేసింది. కాగా, గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరద నీరు పెద్ద మొత్తంలో నదుల్లో చేరటంతో.. గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరి, రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న వాతావరణ శాఖ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి