iDreamPost

నితిన్ @ 500 మిలియన్ ప్లస్

నితిన్ @ 500 మిలియన్ ప్లస్

కుర్ర హీరో నితిన్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత భీష్మ బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇదే ఏడాది పెళ్లి కూడా ఫిక్స్ అయిపోవడంతో ఆనందం రెట్టింపయ్యింది. కరోనా వల్ల వాయిదా పడినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యే కాబట్టి పర్సనల్ గా తీసుకోవడానికి ఏమి లేదు . నిజానికి నితిన్ భీష్మ ముందు వరస డిజాస్టర్స్ లో ఉన్నాడు. మార్కెట్ పరంగానూ దాని ప్రభావం కనిపించింది. ఓపెనింగ్స్ తగ్గడం మొదలయ్యింది. సబ్జెక్టు సెలక్షన్ లో ఎంత వైవిధ్యం చూపించినా ఫలితం మాత్రం ఒకేలా రావడం అభిమానులను సైతం కలవరపెట్టింది.

కాని ఇవే ఫ్లాపులు యుట్యూబ్ లో చెలరేగిపోయి మరీ వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. జానర్ తో సంబంధం లేకుండా నార్త్ ఆడియన్స్ వీటిని ఎగబడి చూస్తుండటం విశేషం. పెళ్లి గురించి క్లాసులు పీకడం తప్ప ఇంకేమి లేదని ఇక్కడి ప్రేక్షకులు తిరస్కరించిన ‘శ్రీనివాస కళ్యాణం’ కేవలం 7 నెలల కాలంలో వంద మిలియన్లు దాటడం విశేషం. మహేష్ బాబు శ్రీమంతుడు స్ట్రెయిట్ తెలుగు వెర్షన్ కు ఈ మార్క్ రీచ్ కావడానికి మూడేళ్ళు పట్టింది. ఇక జనం నో చెప్పిన ‘చల్ మోహనరంగా’ సైతం వంద మిలియన్ల మార్కు దాటేసింది. దీన్ని అఆ 2 పేరుతో డబ్ చేశారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘అఅ’ ను అదే టైటిల్ తో అనువదిస్తే రెండు వందల మిలియన్ మార్క్(192)కు అతి దగ్గరలో ఉంది. ఇవన్ని ఇక్కడి స్థానిక ఆడియో ఛానల్ ఆదిత్య ద్వారా రిలీజైనవి కావడం గమనార్హం. మరో డిజాస్టర్ ‘లై’ 127 మిలియన్ల తో దూసుకుపోతోంది. ఇవన్ని కలిపి లెక్కవేసుకుని చూసుకుంటే కేవలం నాలుగు సినిమాలతోనే ఐదు వందల మిలియన్ల వ్యూస్ దాటిన నితిన్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నట్టే. వీటి దెబ్బకు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా నితిన్ సినిమాలు ఇంకేమున్నాయాని అక్కడి వీక్షకులు వెతుకుతున్నారట. ఏదైతేనేం థియేటర్లలో ఆడకపోయినా ఇలా ఆన్ లైన్లో నితిన్ మూవీస్ రచ్చ చేయడం చూసి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇతని కొత్త సినిమా రంగ్ దే షూటింగ్ కీలక భాగంలో ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది. లాక్ డౌన్ అయ్యాక మళ్ళి ఎప్పుడు మొదలు పెట్టేది చెప్పబోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి