iDreamPost

అనుష్క ‘నిశ్శబ్దం’ బ్రేక్ అవుతుందా

అనుష్క ‘నిశ్శబ్దం’ బ్రేక్ అవుతుందా

కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయో థియేటర్లు, ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని అయోమయం మధ్య మన తెలుగు నిర్మాతలు ఎలాంటి కంక్లూజన్ కు రాలేకపోతున్నారు. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి త్వరగా ఇస్తాయో లేదో కూడా తెలియదు. ఈ గందరగోళం మధ్య ఓటిటిలు భారీ ఆఫర్లతో ప్రొడ్యూసర్లను ఊరిస్తున్నారు. ఎంతగా అంటే తమ పెట్టుబడితో పాటు నిర్మాతలు మంచి లాభాన్ని వెనకేసుకునే లెవెల్ లో. కాని ఒక్కసారి ఈ పోకడ మొదలైతే తర్వాత జరిగే పరిణామాలు ఊహకందడం లేదు.

దాని ప్రభావం నేరుగా డిస్ట్రిబ్యూషన్ రంగం మీద పడుతుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 40 రోజులు దాటింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇంత పెద్ద సంక్షోభం ఎన్నడూ లేదు. ఈ నేపధ్యంలో అనుష్క నిశబ్దం ఆన్ లైన్ రావోచ్చనే వార్తకు గట్టి రెక్కలే వచ్చాయి. నిర్మాతలు వాటిని ఖండిస్తూ ఏదైనా తామే అప్ డేట్ చేస్తామని చెబుతున్నారు తప్ప రెడ్, వి నిర్మాతల లాగా ఖరాఖండిగా తేల్చి పారేయడం లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం నిశబ్దం లాంటి లిమిటెడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న హారర్ థ్రిల్లర్లు మంచి రేట్ వస్తే ఓటిటి ద్వారా విడుదల కావడమే మంచిదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీని పట్ల అనుష్క అంత సానుకూలంగా లేకపోయినప్పటికీ ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎంత లేదన్నా ఇంకో నెల రోజులకు పైగా సినిమా హాళ్ళు ఓపెన్ చేసే సూచనలు లేవు. ఒకవేళ తెరుచుకున్నా జనం పొలోమని తండోపతండాలుగా వచ్చేయరు. అందులోనూ నిశబ్దం లాంటివాటికి కష్టం. పైగా మల్టీ లాంగ్వేజ్ మూవీ కాబట్టి ఓవర్ సీస్ లో రిలీజ్ చేయలేరు. విడుదలయ్యాక ఓటిటికి ఇప్పుడు వచ్చిన ధర వచ్చే ఛాన్స్ లేదు. సో నిశబ్దం ఎటు వైపు వెళ్తుందో చూడాలి మరి. ఇంకో పది రోజుల్లో ఏదో ఒకటి డిసైడ్ చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి