iDreamPost

Karthikeya 2 ప్రభాస్ ని దాటబోతున్న నిఖిల్

Karthikeya 2 ప్రభాస్ ని దాటబోతున్న నిఖిల్

డార్లింగ్ ప్రభాస్ కి ప్యాన్ ఇండియా లెవెల్ లో ఉన్న ఇమేజ్ తెలిసిందే. రాధే శ్యామ్ ఎంత డిజాస్టర్ అయినప్పటికీ హిందీ వెర్షన్ 19 కోట్ల దాకా రాబట్టిందంటే అది బాహుబలి ఇచ్చిన బ్రాండ్ ఫలితమే. అదే సినిమా ఇంకో హీరో చేసుంటే కనీసం కరెండు బిల్లులు కూడా వచ్చేవి కావు. టాలీవుడ్ స్టార్లకు ఎప్పటి నుంచో కలగా మిగిలిపోయిన నార్త్ మార్కెట్ ని మనవాళ్ళు మెల్లగా ఆక్రమించేసుకుంటున్నారు. తాజాగా నిఖిల్ తన కార్తికేయ 2తో మాములు బ్లాక్ బస్టర్ అందుకోలేదు. ఇంకా రెండు వారాలు దాటకుండానే కార్తికేయ 2 రాధే శ్యామ్ ని క్రాస్ చేయబోతోంది. ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ మూవీ నిఖిల్ లాంటి చిన్న హీరో అందుకోవడం చిన్న విషయమైతే కాదు.

దీన్ని బట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో కంటెంట్ ఎంత బలమైన పాత్ర పోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్, దొబారాలు దుకాణం సర్దేయగా దానికి భిన్నంగా కార్తికేయ 2 మాత్రం గత తొమ్మిది రోజులుగా వసూళ్లలో గణనీయ మార్పును పెరుగుదల రూపంలో చూపిస్తూనే ఉంది. విచిత్రంగా తెలుగు వెర్షన్ కొంత నెమ్మదించినప్పటికీ హిందీలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతోంది.


దగ్గరలో లైగర్ తప్ప ఇంకే అడ్డంకులు లేవు. అది కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి కార్తికేయ 2 మీద ఏదో తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పలేం. ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప లేదంటే సేఫే

ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కార్తికేయ 2 డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చేసింది. బయ్యర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అపోజిషన్ గా భావించిన మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ వీక్ కే తోక ముడిచేసింది. మొన్న శుక్రవారం వచ్చిన చిన్న సినిమాలు ఏవీ కనీస అంచనాలు అందుకోకపోవడంతో చాలా మటుకు జీరో షేర్లు నమోదయ్యాయి. బింబిసార, సీతారామంలే బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుండటం గమనార్హం. మొత్తానికి ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు నిఖిల్ కూడా ఆ రేస్ లో జాయిన్ కావడం సంతోషించాల్సిన విషయం. ఫైనల్ రన్ అయ్యేలోపు కార్తికేయ 2 ఫిగర్స్ షాకింగ్ గా ఉండబోతున్నాయనే ట్రేడ్ అంచనా నిజమయ్యేలా ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి