iDreamPost

ఆ వాహనదారులకు షాకిచ్చిన NHAI

ఆ వాహనదారులకు షాకిచ్చిన NHAI

ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రకటనను సైతం విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంతో ఆ వాహనదారులకు దిమ్మతిరిగే వార్తనేది చెప్పక తప్పదు. అయితే, NHAI తాజా ప్రకటనను కొందరు స్వాగతిస్తుంటే.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు NHAI తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి? అసలు విషయం ఏంటంటే? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( NHAI) ప్రమాదాల నివారణకు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెల అంటే (August) 1 నుంచి బెంగుళూరు-మైసూర్ ఎక్స్ ప్రెస్ హైవేపైకి ఆటోలు, బైక్స్, ట్రాక్టర్లు, మోటర్ రహిత వాహనాలు, క్వాడ్రీ సైకిళ్లు, మల్టీ యాక్సిల్ హైడ్రాలిక్ ట్రయిలర్ వంటి వాహనాలను అనుమతించబోమని NHAI తెలిపింది. ప్రమాదాలను నివారించటానికే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటనతో తెలిపింది. అయితే, NHAI తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు  స్వాగతిస్తుంటే కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది  కూడా చదవండి: అత్యంత అరుదైన చేప.. అచ్చం మనిషిలాగే పళ్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి