iDreamPost

కరోనా ఉన్నా ఏపీలో పేదల ఉపాధికి ఢోకా లేదు..

కరోనా ఉన్నా ఏపీలో పేదల ఉపాధికి ఢోకా లేదు..

పేదల ‘ఉపాధి’ వేతనాలు పెరిగాయ్‌..
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పేదలకు కల్పించే ఉపాధి పనుల్లో వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రోజుకు 211 రూపాయలు ఇస్తుండగా.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మరో 26 రూపాయలు పెంచి మొత్తం రూ. 237 ఇవ్వనున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పనులను పరిశీలించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త వేతనాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఉపాధి పనులకు సంబంధించిన వేతనాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో చెల్లిస్తాయి. 2017–18లో రూ. 197 వేతనం ఉండగా, 2018–19లో రూ. 205, 2019–20లో రూ. 211, 2020–21 నాటికి రూ. 236 కు చేరింది. దేశ వ్యాప్తంగా కనీస ఉపాధి వేతనం రూ. 300 నుంచి రూ. 400 చేయాలని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కోరుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు వారి కోరికను వాయిదా వేస్తూ వస్తున్నాయి.

కరోనా ఉన్నా ఏపీలో పేదల ఉపాధికి ఢోకా లేదు..
గ్రామాల్లో సాధారణంగా వేసవి కాలంలో పనులు దొరకని పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలోనే ప్రజలు ఉపాధి హామీ పనులను ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్‌ భయం వెంటాడుతున్న నేపథ్యంలో పేదల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనాపై కూలీలకు జాగ్రత్తలు చెబుతూ అధికారులు పనులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ సగటున 13 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పనుల మధ్యలో స్థానిక అధికారులు కరోనాపై కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి రుమాలు కట్టుకోవడం లాంటివి తప్పనిసరి చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి