iDreamPost
android-app
ios-app

వాహనదారులకు మరింత భారం.. థర్డ్ పార్టీ బీమా పెంపు..

  • Published May 26, 2022 | 6:17 PM Updated Updated May 26, 2022 | 6:17 PM
  • Published May 26, 2022 | 6:17 PMUpdated May 26, 2022 | 6:17 PM
వాహనదారులకు మరింత భారం.. థర్డ్ పార్టీ బీమా పెంపు..

త్వరలో ద్విచక్ర వాహనదారులకు, కార్లకు, కమర్షియల్ వాహనాలకు బీమా ఖర్చులు మరింత పెరగనున్నాయి. వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్స్‌ ఇన్స్యూరెన్స్‌ ను పెంచుతూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. జూన్‌ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. బుధవారం దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా వాయిదా వేస్తూ వచ్చి తాజాగా థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను పెంచారు.

తాజాగా పెంచిన థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం ధరలు వాహనాల కేటగిరీల ప్రకారంగా ఇలా ఉండబోతున్నాయి..

#1000 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల ప్రీమియంను రూ.2072 నుంచి రూ.2094కు పెంచారు.

#1000 సీసీ ఆపైన 1500సీసీ వరకు ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల బీమా ప్రీమియం రూ.3221 నుంచి రూ.3416కు పెంచారు.

# 1500సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న కార్ల బీమా మాత్రం రూ.7897 నుంచి రూ.7890కి తగ్గింది.

#150 సీసీ నుండి 350 సీసీ వరకు ఉండే ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియం ఇకపై రూ.1366గా ఉండనుంది.

#350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉండే బైక్‌ల ప్రీమియం రూ.2804గా నిర్ణయించారు.

#30కిలోవాట్ల కంటే తక్కువ ఉండే ఎలక్ట్రిక్‌ కార్ల ప్రీమియం రూ.1780 కాగా, 30 నుంచి 65 కిలోవాట్ల మధ్య ఉండే ఎలక్రిక్ కార్ల ప్రీమియం రూ.2904గా పెంచారు.

#12000 కేజీల నుండి 20వేల కేజీల సామర్థ్యం గల కమర్షియల్‌ వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రూ.33,414 నుండి ఏకంగా రూ.35,313కు పెంచారు.

#40వేల కేజీల కంటే ఎక్కువ సామర్థ్యమున్న కమర్షియల్‌ వాహనాల ప్రీమియం రూ.41,561 నుండి రూ.44,242కు పెరిగింది.

#అలాగే విద్యాసంస్థలు ఉపయోగించే బస్సులకు ప్రీమియంపైన 15శాతం డిస్కౌంట్‌, హైబ్రీడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలపై రూ.7.5శాతం డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet