iDreamPost
android-app
ios-app

అజయ్ దేవగణ్ వల్లే నాకింకా పెళ్లి కాలేదు.. న‌టి ట‌బు చెప్పిన సీక్రెట్

  • Published Jun 23, 2022 | 9:00 AM Updated Updated Jun 23, 2022 | 11:52 AM
  • Published Jun 23, 2022 | 9:00 AMUpdated Jun 23, 2022 | 11:52 AM
అజయ్ దేవగణ్ వల్లే నాకింకా పెళ్లి కాలేదు.. న‌టి ట‌బు చెప్పిన సీక్రెట్

నిన్నే పెళ్లాడతా లాంటి పలు సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించిన టబు బాలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసింది. ఇప్పటికి కూడా చేస్తుంది. అయితే 50 ఏళ్ళు దాటినా టబు పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ గానే ఉంది. ఇటీవలే భూల్ భూలయ్య 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మెప్పించింది. గతంలో టబుకి కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నా అవి పెళ్లి దాకా వెళ్ళలేదు.

అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, టబు చిన్నప్పట్నుంచి స్నేహితులు. గతంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినా అది జరగలేదు. టబు ఇప్పటికే చాలా సార్లు అజయ్ దేవగణ్ గురించి ఇంటర్వ్యూలలో చెప్పింది. వీరిద్దరూ కలిసి దాదాపు 10 సినిమాల వరకు చేశారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. అయితే అజయ్ వల్లే తాను ఇంకా సింగిల్ గా ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

టబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”అజయ్ నా కజిన్ సమీర్ ఆర్య ఇంటి పక్కనే ఉండేవాడు. చిన్నప్పట్నుంచి స్నేహితుడు. నా చిన్నప్పుడు సమీర్, అజయ్ నా మీద ఓ కన్నేసి ఉంచేవారు. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. నన్ను జాగ్రత్తగా చూసుకోడానికే ఇదంతా. ఎవరైనా అబ్బాయిలు నాతో మాట్లాడాలని ట్రై చేస్తే అజయ్ వాళ్ళని తిట్టి, కొట్టి పంపించేవాడు. రౌడీల్లాగా బిహేవ్ చేసేవాళ్ళు. దీంతో నా దగ్గరికి అబ్బాయిలు రావాలంటేనే భయపడేవాళ్లు. ఒకరకంగా నేను ఇవాళ ఒంటరిగా ఉన్నాను అంటే దానికి అజయ్ కారణం. అతను ఆ తర్వాత దీని గురించి పశ్చాత్తాపపడ్డాడని అనుకుంటున్నాను అని తెలిపింది.

అలాగే అజయ్ తో ఉన్న స్నేహం గురించి చెప్తూ.. నేను ఎవరినైనా నమ్ముతానంటే అది అజయ్ దేవగన్ ని మాత్రమే. అతను ఉన్నప్పుడు నేను సెక్యూర్ ఫీల్ అవుతాను. ఇప్పటికి నా గురించి ఆలోచిస్తాడు. మా ఇద్దరి మధ్య అంత మంచి స్నేహం ఉంది అని తెలిపింది. ఇక జీవితం లో సింగిల్ గా ఉన్నాను అని భాదపడట్లేదని, పెళ్లి చేసుకోనందుకు భాదపడట్లేదని, తప్పుడు భాగస్వామిని ఎంచుకోవడం కంటే సింగిల్ గా ఉండటమే మంచిది అని తన పెళ్లి గురించి మాట్లాడింది.

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasinomilyoncasinomilyonultrabetultrabetgrandpashabet girişcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel giriş