iDreamPost
android-app
ios-app

ఏజెంట్ ఇన్ – భోళాశంకర్ డ్రాప్

  • Published Feb 01, 2023 | 3:55 PM Updated Updated Feb 01, 2023 | 3:55 PM
  • Published Feb 01, 2023 | 3:55 PMUpdated Feb 01, 2023 | 3:55 PM
ఏజెంట్ ఇన్ – భోళాశంకర్ డ్రాప్

అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న ఏజెంట్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్టు తెలిసింది. అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ ఏప్రిల్ 14 రావడం దాదాపు ఖాయమే. ఏదో సింపుల్ గా ప్రకటించకుండా ఒక చిన్న ఈవెంట్ తో ఫ్యాన్స్ కి ఈ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై డ్రామాకు ధృవ ఫేమ్ హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర చేస్తుండటంతో అటుపక్క కేరళలోనూ భారీ హైప్ ఉంది.

అయితే ఏజెంట్ కోసం చిరంజీవి భోళా శంకర్ విడుదలలో మార్పు చేయాల్సి వచ్చిందట. ఎందుకంటే రెండు సినిమాలకు నిర్మాత ఒకరే అనిల్ సుంకర. మెగా మూవీ షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది కాబట్టి హడావిడి పడకుండా దాన్ని మే లేదా జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాక మెగాస్టార్ ఇప్పుడీ భోళా శంకర్ విషయంలో కాసిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యాక్షన్, కామెడీ సన్నివేశాలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయి

సో ఏజెంట్ విషయంలో నెలకొన్న అయోమయం, ప్రచారం అన్నిటికి బ్రేక్ పడినట్టే. క్లైమాక్స్ ని భారీ ఎత్తున రెండు వెర్షన్లు షూట్ చేస్తున్నారట. ఫైనల్ గా ఏది బాగుంటుందనే దాన్ని బట్టి ఎడిటింగ్ టేబుల్ దగ్గర నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రాబోతున్న ఏజెంట్ విజయం అఖిల్ కు చాలా కీలకం. ఇప్పటిదాకా చేసిన నాలుగు సినిమాలూ లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ కావడంతో తర్వాతి లక్ష్యంగా మాస్ ని పెట్టేసుకున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్ తెరకు పరిచయమవుతోంది

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet giriş