iDreamPost

Sankranthi Telugu Releases : తెలుగు సంక్రాంతి రేసులో కొత్త ట్విస్టు

Sankranthi Telugu Releases : తెలుగు సంక్రాంతి రేసులో కొత్త ట్విస్టు

రాబోయే సంక్రాంతి పండక్కు అజిత్ వలిమై విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఒకేసారి వస్తుందనే అంచనాలో అభిమానులు ఉన్నారు. కానీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లతో పాటు బంగార్రాజు రేస్ లో ఉండటంతో వలిమై నిర్మాత బోనీ కపూర్ ఇక్కడ థియేట్రికల్ రిలీజ్ కు మొగ్గు చూపడం లేదట. థియేటర్ల సమస్య వస్తుంది కాబట్టి రెవిన్యూ పరంగా వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆ ఆలోచన డ్రాప్ అయినట్టుగా చెన్నై టాక్. అంటే కేవలం తమిళ వెర్షన్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా పొంగల్ కు రిలీజవుతుందట. మరి ఇక్కడ ఎప్పుడు తెస్తారు అనే సందేహం రావడం సహజమే.

ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. వలిమై ఫైనల్ కాపీ చూశాక దీన్ని అనువదించడం కన్నా రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన బోనీ కపూర్ కు వచ్చిందట. పింక్ కోలీవుడ్ రీమేక్ నీర్కొండ పార్వైనే తెలుగులో వకీల్ సాబ్ గా మార్చుకున్న సంగతి తెలిసిందే. అలా చేయడం వల్లే కమర్షియల్ గా ప్రాజెక్ట్ చాలా సేఫ్ అయ్యింది. ఇప్పుడు వలిమై లాంటి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాని అదే పవన్ తో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు బోనీ బృందంలో చాలా సీరియస్ గా జరుగుతున్నాయని వినికిడి. ఒకవేళ వలిమై కనక పవన్ కు నచ్చితే ఇప్పుడున్న కమిట్ మెంట్ల తర్వాత ఎస్ చెప్పడానికి అవకాశం ఉంది. వకీల్ సాబ్ లో బోనీ కపూర్ భాగస్వామే కాబట్టి ఇబ్బంది లేదు

వలిమై మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ కన్నా ఎక్కువ రేట్ తమిళనాడులో పలకడం చూస్తే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా మీద విలన్ గా నటించిన ఆరెక్స్ 100 కార్తికేయ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాకపోతే రిస్కీ స్టంట్ లు, ఛేజులు వలిమైలో ఎక్కువగా ఉన్నాయి. పవన్ ఈ తరహా బ్యాక్ డ్రాప్ లో గతంలో ఎన్నడూ చేయలేదు. తెలుగులో వచ్చినవి కూడా తక్కువే. నాగార్జున సూపర్ లాంటివి కొన్ని ఉన్నాయి. మరి వలిమై విషయంలో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో వేచి చూడాలి. పవన్ ఇంకో ఏడాదికి పైగా ఖాళీ లేరు.

Also Read : RRR Promotions : పరుగులు పెడుతున్న చరణ్ తారక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి