iDreamPost

రష్మిక బాలీవుడ్ ఎంట్రీకి ట్విస్టులు..

రష్మిక బాలీవుడ్ ఎంట్రీకి ట్విస్టులు..

పుష్ప 1లో శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ ఎంట్రీ సవ్యంగా సాగడం లేదు. ఆ మధ్య విడుదలైన అమితాబ్ బచ్చన్ గుడ్ బై డిజాస్టర్ కావడం తనకు బ్యాడ్ మెమరీగా మిగిలిపోయింది. మంచి కథ, చాలా పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పటికీ దర్శకుడి టేకింగ్ వల్ల ప్రేక్షకుల మెప్పు పొందలేదు. ఫలితంగా డెబ్యూ మూవీ కాస్తా ఫ్లాప్ మూటగట్టుకుంది. నిజానికి తన మొదటి హిందీ సినిమా ఇది కాదు. సిద్దార్థ్ మల్హోత్రాతో జోడిగా నటించిన మిషన్ మజ్ను. ఇది ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్ నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చి ఫైనల్ గా ట్విస్టు ఇచ్చింది.

 

Rashmika Mandanna pens inspiring note on insecurities amid lockdown

మిషన్ మజ్ను నేరుగా ఓటిటి రిలీజ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా వచ్చే సంవత్సరం జనవరిలో డిజిటల్ ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. శంతను భాగ్చీ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హీరో పాత్ర స్పైగా ఉంటుంది. గూఢచారి నేపథ్యంలో ఇటీవలే కార్తీ సర్దార్ గుర్తుందిగా. అదే తరహాలో ఇది కూడా సాగుతుంది. బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు పెట్టారు. సైన్ చేసే ముందు రష్మిక ఒప్పుకుంది ఆ ప్రొడక్షన్ వేల్యూస్ చూసే. తీరా చూస్తే ఇప్పుడిది ఓటిటి బాట పట్టింది. బాక్సాఫీస్ వద్ద పరిణామాలు ఏమంత ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో నిర్మాతలు మంచి ఓటిటి డీల్ వస్తే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒప్పేసుకుంటున్నారు.

Rashmika Mandanna ने फैन को दिया ऐसी जगह अपना ऑटोग्राफ, Video को देखकर लोग  कर रहे ऐसे रियेक्ट

ఒకరకంగా చూస్తే ఇలా చేయడమే మంచిది. అంత స్టార్ హృతిక్ రోషన్ విక్రమ్ వేదానే తిరస్కారానికి గురయ్యింది. అక్షయ్ కుమార్ కు మూడు డిజాస్టర్లు పడ్డాయి. ఈ నెల 25న విడుదల కాబోతున్న భేడియా(తెలుగు డబ్బింగ్ తోడేలు)కు ఓపెనింగ్స్ రావనే అంచనాతో నిర్మాతలు బుక్ మై షోతో చేతులు కలిపి క్యాష్ బ్యాక్ ఆఫర్లతో జనాన్ని థియేటర్ కు రప్పించే ప్రణాళికలు వేస్తున్నారు. కోట్ల బడ్జెట్ టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. అందుకే అయితే ఓటిటి లేదా షాక్ ఇచ్చే రేంజ్ లో ప్రమోషన్లు. ఈ రెండూ వద్దనుకుంటే కంటెంట్ మీద బలంగా వర్క్ చేయాలి. ఏదో ఆషామాషీ కథలను ఒప్పుకునే మూడ్ లో నార్త్ ఆడియన్స్ అసలు లేరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి