iDreamPost

రాజకీయాల్లో కొత్త సెంటిమెంట్.. బాబును వదిలేస్తే పదవి గ్యారెంటి!

రాజకీయాల్లో సెంటిమెంట్స్ అనేవి సర్వసాధారణం. వరుసగా జరిగే పరిణామాలతో ఈ సెంటిమెంట్స్ ఏర్పడుతుంటాయి. తాజాగా చంద్రబాబును వదిలేస్తే.. ఆ పదవి గ్యారెంటీ అనే ఓ సెంటిమెంట్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. అయితే ఈ సెంటిమెంట్ ఏపీలో కాదు..తెలంగాణ టీడీపీలో జరుగుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

రాజకీయాల్లో సెంటిమెంట్స్ అనేవి సర్వసాధారణం. వరుసగా జరిగే పరిణామాలతో ఈ సెంటిమెంట్స్ ఏర్పడుతుంటాయి. తాజాగా చంద్రబాబును వదిలేస్తే.. ఆ పదవి గ్యారెంటీ అనే ఓ సెంటిమెంట్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. అయితే ఈ సెంటిమెంట్ ఏపీలో కాదు..తెలంగాణ టీడీపీలో జరుగుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

రాజకీయాల్లో కొత్త సెంటిమెంట్.. బాబును వదిలేస్తే పదవి గ్యారెంటి!

రాజకీయాల్లో సెంటిమెంట్స్ అనేవి సర్వసాధారణం. వరుసగా జరిగే పరిణామాలతో ఈ సెంటిమెంట్స్ ఏర్పడుతుంటాయి. ఫలానా పదవి చేసిన వారు మరుసటి ఎన్నికల్లో ఓడిపోతారని, ఫలానా నియోజకవర్గంలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఇలా అనేక రకాల సెంటిమెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంటాయి. ఇప్పటికే ఇలాంటి  వార్తలు రాజకీయాల్లో ఎన్నో చూశాము. తాజాగా చంద్రబాబును వదిలేస్తే.. ఆ పదవి గ్యారెంటీ అనే ఓ సెంటిమెంట్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. అయితే ఈ సెంటిమెంట్ ఏపీలో కాదు..తెలంగాణ టీడీపీలో జరుగుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఆ సెంటిమెంట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై..52 రోజులు జైల్లో  ఉన్నారు. ఇటీవలే మధ్యతర బెయిల్ పై బయటకు వచ్చారు. నాలుగు వారాల పాటు ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయం పక్కన పెడితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదనే విషయం తెలిసిందే. అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. అంతేకాక ఆయన బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే టీటీడీపీ విషయంలో ఓ సెంటిమెంట్ పొలిటకల్ సర్కిల్ లో వినిపిస్తోంది. గతంలో టీటీడీపీ తొలి అధ్యక్షుడిగా పని చేసిన ఎల్.రమణ.. కొంతకాలానికి ఆ పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరి.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా కాసాని  జ్ఞానేశ్వర్ కూడా టీటీడీపీ రాజీనామా చేశారు. అంతేకాక టీడీపీ అధినాయకత్వంపై చాలా సీరియస్ అయ్యారు. అన్ని స్థానాల్లో కాకపోయిన..టీడీపీ బలంగా ఉన్న స్థానంలో పోటీ చేయాల్సిందని, అలా చేయకపోవడం..తనను పూర్తిగా కలచివేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే టీటీడీపీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఆయన బీఆర్ఎస్ లో చేరుతారనే వార్తలు వినిపిస్తోన్నాయి.

ఆయనకు బీఆర్ఎస్ లోని కొందరు నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని, దీంతో బీఆర్ఎస్ లో చేరుతారనే తెలుస్తోంది. అంతేకాక ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తసోంది. అదే నిజమైంతే… కొత్త సెంటిమెంట్ పొలిటికల్ సర్కిల్ లో వచ్చిందని, బాబును వదిలేస్తే పదవి గ్యారెంటీ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. మరి..తెలంగాణ టీడీపీ నేతలు బాబును వదిలేస్తే.. ముఖ్యంగా ఆ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులుగా పని చేసిన వారు వదిలేస్తే పదవి గ్యారెంటీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి