iDreamPost

New Scheme: కేంద్రం కొత్త పథకం.. అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం!

New Scheme: కేంద్రం కొత్త పథకం.. అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం!

దేశంలో ఆడవారికి రక్షణ పెద్ద సవాలుగా మారింది. ఉయ్యాల్లో ఆడుకునే పసికందు నుంచి మంచలో పడ్డ ముసలవ్వ దాకా ఏదో రకంగా దాడిగి, అఘాయిత్యానికి గురవుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మైనర్లపై దాడులు, అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి. తన అనుకున్న వాళ్లే తాచుల్లా కాటేస్తుంటే ఆడవాళ్ల పరిస్థిత అగమ్యగోచరంగా మారింది. అంతేకాకుండా మైనర్లలో అవాంచిత గర్భాలు మరీ సవాలుగా మారాయి. అలాంటి వారికి సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది.

అత్యాచార బాధితుల్లో ముఖ్యంగా మైనర్ల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అత్యాచారం వల్ల గర్భం దాల్చడం, ఇంట్లో వాళ్లు తమకు సంబంధం లేదని వదిలేయడం చేస్తుంటారు. మైనర్ అత్యాచార బాధితులకు అండగా నిలిచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. వారికి ఆర్థిక సాయం చేసేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, సంక్షేమ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్కీమ్ కోసం నిర్భయ నిధుల నుంచి రూ.74.10 కోట్లను కేయించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వాత్సల్య అనే పథకాన్ని తీసుకొచ్చారు.

ఈ పథకం ముఖ్యంగా అత్యాచారానికి గురై కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు. ఈ పథకంలో మైనర్ బాధితులకు షెల్టర్, నిత్యావసరాలు, భోజనం, కోర్టుకు వెళ్లేందుకు దారి ఖర్చులు ఇస్తారు. ఈ పథకం కింద నెలకు ఒక్కో బాలికకు రూ.4 వేలు చొప్పున అందించనున్నట్లు సమాచారం. అవాంచిత గర్భం వల్ల బిడ్డకు జన్మనిస్తారు. అలాంటి బిడ్డ వారికి వద్దు అనుకుంటే దత్తత ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 5, సెక్షన్ 376, 376ఏ కింద బాధితులుగా ఉన్న వారు, 18 ఏళ్లలోపు వయసు ఉండి కుటుంబం వదిలేసిన, కుటుంబానికి దూరంగా బతుకున్న వారికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి