iDreamPost

Fact Check:రూ.500నోట్లపై శ్రీరాముడి చిత్రం అంటూ వార్తలు! అసలు నిజం?

ప్రస్తుతం అయోధ్య రామమందిరం గురించి వచ్చే ప్రతి వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొన్ని ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. తాజాగా రూ.500 నోట్లపై శ్రీరాముడి చిత్రం అంటూ ఓ వార్త ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అయోధ్య రామమందిరం గురించి వచ్చే ప్రతి వార్త సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొన్ని ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. తాజాగా రూ.500 నోట్లపై శ్రీరాముడి చిత్రం అంటూ ఓ వార్త ప్రచారం జరుగుతోంది.

Fact Check:రూ.500నోట్లపై శ్రీరాముడి చిత్రం అంటూ వార్తలు! అసలు నిజం?

నేటికాలంలో ప్రపంచంలో ఓ మూలన ఏది జరిగినా క్షణాల్లో మన తెలిసిపోతున్నాయి. అలానే అనేక ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్  అవుతుంటాయి. అవి నిజమా? కాదా అని తెలుసుకోకుండా కొందరు ఫార్వర్డ్ చేస్తుంటారు. తాజాగా అయోధ్య రాముడికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు నిజమేమో అని నమ్మేశారు. రూ.500 నోట్లపై శ్రీరాముడి చిత్రం అంటూ సోషల్ మీడియాలో న్యూస్  వైరల్ అయింది. ఈ న్యూస్ పై స్పందించిన బ్యాకింగ్ నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు.

అయోధ్యలో రామ మందిరం ఏర్పాటు అనేది కోట్లాది మంది కల. కొన్ని దశాబ్దాల పాటు అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాటలు జరిగాయి. చివరకు అందరి ఆశలు నిజమవుతూ జనవరి 22న అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. విగ్రహ నిర్మాణం, దేవుడి లడ్డు, అయోధ్య గంట, సీతాదేవి చీర, అలానే అయోధ్యకు వచ్చే బహుమతులు..ఇలా రామయ్యకు సంబంధించిన ప్రతి వార్త సంచలనంగా మారుతోంది.

ఈ నేపథ్యంలోనే కొన్ని తప్పుడు వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరాముడి ఫోటోలతో కూడిన రూ.500 నోటును విడుదల చేయనుందనే ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాక రూ.500 నోటుపై శ్రీరాముడి చిత్రం రానుందనే వార్త తెగ వైరల్ గా మారింది.  అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రూ.500 నోటుకు ముందు భాగంలో శ్రీరాముడి ఫోటో.. వెనుక వైపు అయోధ్య రామ మందిరం ఫోటో కనిపిస్తోంది.  ప్రస్తుతం రూ.500 నోట్లపై జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం ఉండే ప్రదేశంలో రాములోరి ఫోటో ఉన్నట్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి.  ఈ వార్త నిజమో, అబద్ధమో అనే విషయం పక్కన ఉంచితే.. అలా నోటుపై రాముడి ఫోటో చూసిన చాలా మంది  జై శ్రీరామ్ అంటూ  తెగ ఆనంద పడిపోతున్నారు.

జనవరి 22 శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్ ను విడుదల చేయబోతుందని నోటుకు వెనుక వైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఫోటోను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొందు పరుస్తోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఫేక్ వార్త అంటూ బ్యాంకింగ్ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న ఈ కొత్త నోటుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. ఆయన సమక్షంలో అభిజిత్ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ వేడుకకు ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. మరి..సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నా రాములోరి  న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి