iDreamPost

HYDలో మెట్రో విస్తరణ.. కీలక ప్రాంతాలను కలుపుతూ కొత్త రూట్ మ్యాప్!

హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. నగరంలోని కీలక ప్రాంతాలను ఎయిర్ పోర్టుకు అనుసంధానం చేస్తూ కొత్త రూట్ మ్యాప్ ను అధికారులు సిధ్దం చేశారు. ఏయే ప్రాంతాల్లో అంటే?

హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు మార్గం సుగమం అయ్యింది. నగరంలోని కీలక ప్రాంతాలను ఎయిర్ పోర్టుకు అనుసంధానం చేస్తూ కొత్త రూట్ మ్యాప్ ను అధికారులు సిధ్దం చేశారు. ఏయే ప్రాంతాల్లో అంటే?

HYDలో మెట్రో విస్తరణ.. కీలక ప్రాంతాలను కలుపుతూ కొత్త రూట్ మ్యాప్!

హైదరాబాద్ మహానగరంలో రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మెట్రో ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన కొత్త రూట్ మ్యాప్ ను అధికారులు ప్రభుత్వానికి అందించారు. రెండో దశ విస్తరణలో నగరంలోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణను చేపట్టనున్నది ప్రభుత్వం. దీంతో అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. హైదరాబాద్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లేవారికి.. ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు వచ్చేవారికి ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మెట్రో విస్తరణపై సమీక్ష చేశారు. ఈ సమీక్షలో గత ప్రభుత్వం సూచించిన రూట్ మ్యాప్ ను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త మార్గాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం రేవంత్ సూచించారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న వేళ భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, శంషాబాద్‌ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ మెట్రో రైలు మార్గం విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో శంషాబద్ విమానాశ్రయానికి కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు అధికారులు. తాజాగా ప్రభుత్వానికి సమర్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చేలా కొత్త రూట్‌మ్యాప్‌ను డిజైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

Metro expansion in HYD

మెట్రో రైలు సేవలు మరిన్ని ఎక్కువ ప్రాంతాలకు విస్తరించాలి.. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగ పడాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ రూట్‌మ్యాప్‌తో నెరవేరనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఉన్న రెండో కారిడార్‌ను రెండో దశ విస్తరణ కింద చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు పొడిగిస్తారు. చాంద్రాయణగుట్ట మెట్రో జంక్షన్ నుంచి మైలార్ దేవ్ పల్లి, పి-7 రోడ్డు మీదుగా మెట్రో పరుగులు పెట్టనున్నది. మెట్రో విస్తరణ రెండో దశ కింద మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రవాణా వ్యవస్థ మెరుగవడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వనున్నది. మెట్రో విస్తరణ చేయనున్న ఆయా ప్రాంతాల్లో భూములు మరింత కాస్ట్లీగా మారనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి