iDreamPost

OTT: ఆ ఘోరమైన కుట్ర వెబ్ సిరీస్‍ గా..! దీన్ని అస్సలు మిస్ కావద్దు!

  • Published Feb 06, 2024 | 2:50 PMUpdated Mar 14, 2024 | 4:51 PM

ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంటర్టైన్మెంట్ కు కొదవే ఉండడం లేదు. తాజాగా మరో క్రైమ్ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టడానికి సిద్ధం అవుతోంది.

ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఎంటర్టైన్మెంట్ కు కొదవే ఉండడం లేదు. తాజాగా మరో క్రైమ్ సిరీస్ ఓటీటీలో అడుగుపెట్టడానికి సిద్ధం అవుతోంది.

  • Published Feb 06, 2024 | 2:50 PMUpdated Mar 14, 2024 | 4:51 PM
OTT: ఆ ఘోరమైన కుట్ర వెబ్ సిరీస్‍ గా..! దీన్ని అస్సలు మిస్ కావద్దు!

ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ లో ఎక్కడ చూసిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ దే హవా. అటు థియేటర్ లలో విడుదలైన చిత్రాలు, ఇటు ప్రత్యేకించి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇలా మొత్తంగా ప్రతి వారం.. పదుల సంఖ్యలో ఓటీటీలో విడుదల అవుతూ వస్తున్నాయి. ఓటీటీలో విడుదల అయ్యే వాటిలో ఫ్యామిలీ ఎంటెర్టైన్మెంట్స్ తో పాటు.. ముఖ్యంగా హార్రర్, క్రైమ్ కథలను ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. చాలా వరకు క్రైమ్ కథలకు ఆడియన్సు కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో .. త్వరలో ఒక క్రైమ్ వెబ్ సిరీస్ రాబోతుంది. క్రైమ్ సిరీస్ ఇష్టపడే వారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి.

త్వరలో ఓటీటీలో ప్రసారం కానున్న ఈ సిరీస్ పేరు “పోచర్‌”. ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ ను.. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ సంస్థ అయిన.. క్యూసీ ఎంటర్‌టైన్‍మెంట్ నిర్మించారు. ఆ సంస్థతో పాటు ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియా భట్‌ కూడా మరో నిర్మాతగా వ్యవహించారు. రిచీ మెహతా “పోచర్‌” సిరీస్ కు దర్శకత్వం వహించారు. కాగా, మలయాళ ప్రముఖ నటి నిమిషా సజయన్, రోషన్ మథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే, గతంలో రిచీ మెహతా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎమీ అవార్డును అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ క్రైమ్ సిరీస్ తో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోకున్నారో వేచి చూడాలి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సిరీస్ విడుదల తేదీన ప్రకటించారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‌ అయిన అమెజాన్ ప్రైమ్ లో.. ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు. పైగా “పోచర్‌” సిరీస్ తెలుగుతో పాటు కన్నడ,మలయాళం,హిందీ,తమిళ్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉండనుంది. ఇటీవల సుడాన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్‍లో కూడా ఈ సిరీస్‍ను ప్రదర్శించారు. ఆ సమయంలో ఈ సిరీస్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇక కథ విషయానికొస్తే .. అడవుల్లో వణ్య ప్రాణులు ముఖ్యంగా ఏనుగులపై జరిగిన దాడుల గురించి ప్రధానంగా పోచర్ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారు.

అయితే, భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఏనుగు దంతాల నెట్‍వర్క్‌ గుట్టు రట్టు చేసేందుకు.. కృషి చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులతో పాటు.. భారత వణ్యప్రాణుల ట్రస్ట్ ఎన్‍జీవో వర్కర్లు, పోలీసులు ఇలా ఎందరో కష్టం “పోచర్” వెబ్ సిరీస్ లో కనిపిస్తోందని మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా ఈ సిరీస్ కోసం సుమారు నాలుగు సంవత్సరాల పాటు పరిశోధన చేసినట్లు.. డైరెక్టర్ రిచీ మెహతా పేర్కొన్నారు. గతంలో కూడా ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్‍కు రిచీ దర్శకత్వం వహించారు. అది కూడా 2012 ఢిల్లీ గ్యాంప్ రేప్ కేసు ఆధారంగా తీసుకుని ఆయన డైరెక్ట్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఢిల్లీ క్రైమ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోయే “పోచర్” ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి,” పోచర్” స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి