iDreamPost

IND vs SA: 176కు సౌతాఫ్రికా ఆలౌట్.. 6 వికెట్ల తీసిన బుమ్రా.. సిరాజ్​ కంటే అతడే బెస్ట్!

తొలి ఇన్నింగ్స్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగితే.. నేనేమీ తక్కువ తినలేదన్నట్లుగా రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా సైతం 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అయితే సిరాజ్ కంటే బుమ్రానే బెస్ట్ అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి వారు అలా అనడానికి కారణం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

తొలి ఇన్నింగ్స్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగితే.. నేనేమీ తక్కువ తినలేదన్నట్లుగా రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా సైతం 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అయితే సిరాజ్ కంటే బుమ్రానే బెస్ట్ అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి వారు అలా అనడానికి కారణం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

IND vs SA: 176కు సౌతాఫ్రికా ఆలౌట్.. 6 వికెట్ల తీసిన బుమ్రా.. సిరాజ్​ కంటే అతడే బెస్ట్!

సౌతాఫ్రికా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించడానికి టీమిండియా సిద్దంగా ఉంది. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మకమైన రెండో టెస్ట్ లో భారత్ ముందు 78 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది సఫారీ టీమ్. రెండో ఇన్నింగ్స్ లో ప్రోటీస్ టీమ్ 176 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా విజయం దాదాపు ఖాయం అయినట్లే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా పేస్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగితే.. నేనేమీ తక్కువ తినలేదన్నట్లుగా బుమ్రా సైతం 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అయితే సిరాజ్ కంటే బుమ్రానే బెస్ట్ అంటున్నారు కొందరు నెటిజన్లు. మరి వారు అలా అనడానికి కారణం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

జస్ప్రీత్ బుమ్రా 8, మహ్మద్ సిరాజ్ 7 రెండో టెస్టులో వీరు పడగొట్టిన వికెట్లు. తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా నిప్పుల వర్షం కురిపించాడు. దీంతో ఈ టెస్ట్ లో టీమిండియా విజయం దాదాపు ఖరారైంది. అయితే ఈ పోరులో ఓ ఆసక్తికర విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు నెటిజన్లు. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ కంటే.. జస్ప్రీత్ బుమ్రానే బెస్ట్ అంటూ కితాబిస్తున్నారు. అదేంటి ఇద్దరూ సమానంగానే వికెట్లు తీశారుగా.. పైగా సిరాజ్ కంటే బుమ్రా ఎక్కువ రన్స్ సమర్పించుకున్నాడు.

అయితే ఇక్కడే ఓ పాయింట్ ను వారు ఎత్తిచూపుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాను తన పేస్ బౌలింగ్ తో తొలి ఇన్నింగ్స్ లో కోలుకోలేని దెబ్బకొట్టాడు సిరాజ్. 9 ఓవర్లు వేసి 3 మెయిడెన్స్ తో 15 పరుగులు మాత్రమే ఇచ్చి.. 6 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా 9 ఓవర్లు వేసి మూడు మెయిడెన్స్ తో 31 రన్స్ ఇచ్చి కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇక బుమ్రా విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్ లో 8 ఓవర్లకు ఒక మెయిడెన్ తో 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూల్చాడు. రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిన బూమ్ బూమ్ బుమ్రా 13 ఓవర్లు వేసి 61 రన్స్ ఇచ్చి.. 6 వికెట్లను నేలకూల్చాడు. ఈ గణాంకాలు చూస్తే మీకు సిరాజే బెస్ట్ అనిపించొచ్చు. కానీ.. బుమ్రానే బెస్ట్ అంటున్నారు కొందరు నెటిజన్లు. మ్యాచ్ స్టార్టింగ్ లో సిరాజ్ పై ఎలాంటి ఒత్తిడి లేదు. అదీకాక పిచ్ నుంచి వస్తున్న స్వింగ్ ను ఉపయోగించుకుని మంచి లెంగ్త్ లో బాల్స్ వేస్తూ పోయాడు. అతడి బౌలింగ్ కు ప్రోటీస్ బ్యాటర్లు దాసోహం అయ్యారు.

కానీ.. రెండో ఇన్నింగ్స్ లో పరిస్థితి భిన్నంగా ఉంది. దక్షిణాఫ్రికా జట్టును ఎన్ని రన్స్ లోపు ఆలౌట్ చేయాలి? తక్కువ స్కోర్ కే ఆ జట్టును పరిమితం చేయాలనే ఒత్తిడి బౌలర్లపై ఉంది. ఈ ఒత్తిడిని అధిగమిస్తూ.. ప్రతీ ఓవర్, ప్రతీ బాల్ ను కచ్చితత్వం, నియంత్రణతో తన అనుభవాన్నంతా రంగరించి.. ఈ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేశాడు బుమ్రా. ఇదంతా కాకుండా.. బౌండరీలతో విరుచుకుపడుతూ సెంచరీ(106) చేశాడు మార్క్రమ్. మిగిలిన ఎండ్​ లో వచ్చిన వారిని వచ్చినట్లు పెవిలియన్ ​కు పంపుతూన్నప్పటికీ.. మార్క్రమ్ తన ఆటను కొనసాగించాడు. దీంతో టీమిండియాపై సహజంగానే ఒత్తిడి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య బుమ్రా ఇలాంటి బౌలింగ్ చేయడం నిజంగా అద్భుతం అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ సిరాజ్ కంటే బుమ్రానే బెస్ట్ అంటూ వారు చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి