iDreamPost

విషాదం: ప్రధానమంత్రి సతీమణి గుండెపోటుతో మృతి..

విషాదం: ప్రధానమంత్రి సతీమణి గుండెపోటుతో మృతి..

ఇటీవల కాలంలో సినీ,రాజకీయ ప్రముఖల మరణవార్తలు తరచూ వినిపిస్తున్నాయి. అనారోగ్యం, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు వంటి వివిధ కారణాలతో పలువురు ప్రముఖులు మరణిస్తున్నారు.  సినీ, రాజకీయ ప్రముఖల మరణంతో వారి కుటుంబం సభ్యులతో పాటు అభిమానులు సైతం విషాదంలో మునిగి పోతున్నారు. తాజాగా నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ సతీమణి సీతా దహల్ మృతి చెందారు. దీంతో ప్రచండ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ సతీమణి సీతా దహల్ గుండెపోటుతో మృతి చెందారు. చాలా కాలం నుంచి ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కొద్ది రోజుల నుంచి నార్విక్  ఇంటర్నేషనల్  ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం ఆమె ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచారు.  ఆమె మృతిపై ఆస్పత్రి వర్గాలు కీలక వివరాలు  వెల్లడించాయి. సీతా దహల్‌ డయాబెటిస్, హైపర్‌ టెన్షన్‌తో బాధ పడుతున్నట్లు వైద్యలు తెలిపారు. అలానే ఆమె అరుదైన నరాల రుగ్మతకు చికిత్స పొందతూ వచ్చారు. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్ సెంటర్)కి  సీత సలహాదారుగా పనిచేశారు. 2021లో భారత్ లోనూ సీత దహల్ చికిత్స పొందారు. తాజాగా ఆమె ఆరోగ్యం మెరుగు పరిచేందుకు ఎన్ని ప్రయత్నలు చేసిన ఫలించలేదు.

ఈ క్రమంలోనే బుధవారం ఉధయం 8.33 నిముషాలకు సీతా దహల్ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు స్పష్టం చేశారు. రెండేళ్లుగా చికిత్స అందిస్తున్నా సీతా దహల్ ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదు. ఆమె మెదడుకి సంబంధించిన Parkinson జబ్బుతో కూడా బాధ పడుతున్నారు. బుధవారం ఉదయం 8.00 గంటల ప్రాంతంలో ఆమెకు గుండెపోటు వచ్చినట్లు ప్రధాని ప్రచండ వ్యక్తిగత వైద్యుడు యువరాజ్ శర్మ  వెల్లడించారు. ఆమె మృతిపై నేపాల్ దేశంలోని పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు. అలానే ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి.. నివాళ్లర్పించారు. నేపాల్ ప్రధాని సతీమణి మృతిపై వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు తమ సంతాపం తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి