iDreamPost

పవన్ ను చావు దెబ్బ తీసిన నారా లోకేశ్? ఇరికించేశాడు..

Pawan, Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ సీఎం అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన కార్యకర్తలను నిరాశకు గురి చేశాడు. మరి..లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..

Pawan, Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పవన్ సీఎం అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన కార్యకర్తలను నిరాశకు గురి చేశాడు. మరి..లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..

పవన్ ను చావు దెబ్బ తీసిన నారా లోకేశ్? ఇరికించేశాడు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇక్కడ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇది కొన్నేళ్ల నుంచి నడుస్తూనే ఉంది. ప్రస్తుతం కూడా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. జనసేన, టీడీపీ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం సీటుపై జనసేన అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ఆశిస్తున్నారు. ఇలాంటి సమయంలో నారా లోకేశ్ జనసేనను, పవన్ కల్యాణ్ ను చావు దెబ్బ తీశారనే టాక్ వినిపిస్తోంది. అందుకు ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. మరి.. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు టీడీపీ, జనసేన సీట్లు పంచుకున్నట్లే, సీఎం సీటును కూడా షేర్ చేసుకుంటారని జనసేన కార్యకర్తలు భావించారు. 2024లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే.. పవన్ ను ముఖ్యమంత్రిగా చూడొచ్చని కొండంత ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుకు కూడా వారి ఆశలను ఇంకాస్త ఎక్కువగా చూపిస్తూ పవన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అయితే చంద్రబాబుది నాన్చుడు ధోరణి అని అందరికీ తెలిసిందే. అయితే అందుకే సీఎం సీటు షేరింగ్ పై బాబు ఎప్పుడూ ప్రస్తావించలేదు. దీంతో జనసైనికులు కూడా పవన్ సీఎం అవుతారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

అయితే జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానుల ఆశ, నమ్మకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నీళ్లు చల్లారు.  నీళ్లు చల్లారు అనే కంటే.. జనసేనను  లోకేశ్ చావు దెబ్బ తీశారని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. సీఎం పదవి గురించి తాను, చంద్రబాబు కూర్చొని మాట్లాడుకుంటామని కొన్ని రోజుల క్రితమే పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే తాజాగా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు పూర్తి విరుద్దంగా ఉన్నాయి. పవన్ కు అంత సీన్ లేదని సీఎంగా చంద్రబాబే ఉంటారని లోకేశ్ పరోక్షంగా తేల్చి చెప్పారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనతో ఓట్లు, సీట్లు పంచుకుంటున్నారని, అదే రీతిలో సీఎం పదవిని కూడా పంచుకుంటారా? అని జర్నలిస్టు లోకేశ్ ను ప్రశ్నించారు.  ఆ ప్రశ్నకు ఏమాత్రం ఆలోచించకుండా చాలా  కాన్ఫిడెంట్ గా లోకేశ్ సమాధానం ఇచ్చారు.  లోకేశ్ మాట్లాడుతూ.. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే  సీఎం. అందులో  రెండో ఆలోచనే లేదని లోకేశ్ తెలిపారు. అంతేకాక పవన్ కల్యాణ్ కూడా చాలాసార్లు చెప్పారు.. సమర్థవంతమైన నాయకత్వం కావాలని లోకేశ్ చెప్పుకొచ్చాడు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుభవం ఉన్న నాయకత్వం చాలా  అవసరమని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారని లోకేశ్ తెలిపారు. మా అందరి మాట కూడా అదే అని లోకేశ్ సీఎం సీటు గురించి స్పష్టంచేశారు.

లోకేశ్ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, నేతలు మండిపడుతున్నారని టాక్. సీఎం పదవికి పవన్ ను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఎలా మాట్లాడుతారని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ కి మద్దతుగా నిలబడిన మాజీ మంత్రి హరిరామజోగయ్య..లోకేశ్ వ్యాఖ్యలతో సీరియస్ అయ్యారు. అంతేకాక ఇంకా యాచించే స్థితేనా అంటూ పవన్ కల్యాణ్ కి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం అయితే, మరి పవన్ సీఎం కావాలని కలలుకన్న జనసేన కార్యకర్తలు, అభిమానుల కలలు ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. ఇలా హరి రామజోగయ్య తోపాటు, జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంకో వాదన వినిపిస్తోంది.

టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే… ఎవరు సీఎం అవుతారనేది  పవన్ కి ముందే తెలుసని టాక్ వినిపిస్తోంది.  కేవలం తాను ఎమ్మెల్యే అయ్యేందుకే.. తాను సీఎం కాలేనని తెలిసిన.. కార్యకర్తలు మభ్యబెడుతు వస్తున్నారు. లోకేశ్ వ్యాఖ్యల కంటే ముందే పవన్ కి..తాను సీఎంను కాదనే విషయం తెలుసనే టాక్  వినిపిస్తోంది. ఆ మేరకు పవన్ టీడీపీతో ఒప్పందం చేసుకోవడంతోనే లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారనే మరో వాదన వినిపిస్తోంది. అయితే తనను నమ్ముకున్న వారిని మభ్యపెట్టేందుకే తాను అవకాశం వస్తే సీఎం పదవి తీసుకుంటానని చెబుతూ వచ్చారనే పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా తన సామాజిక వర్గం వారిని, అభిమానులను మభ్యపెడుతూ వస్తున్న పవన్ ను, లోకేశ్ తన వ్యాఖ్యలతో ఇరికించారనే వార్తలు వినిపిస్తోన్నాయి. మొత్తంగా ఎన్నికల నాటికి వీరి కూటమి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి.. ఇలా తన వ్యాఖ్యలతో పవన్ ను, జనసేన అభిమానులను నారా లోకేశ్ చావు దెబ్బ తీశారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి