iDreamPost

తండేల్ విషయంలో నాగ చైతన్య డేరింగ్ స్టెప్.. రిస్క్ తీసుకుంటున్నాడా?

Naga Chaitanya Thnadel Movie: నాగ చైతన్య- సాయి పల్లవి కాంబోలో తండేల్ మూవీ రాబోతోంది. ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. కానీ, టీమ్ మాత్రం రిస్క్ తీసుకుంటోంది అంటున్నారు.

Naga Chaitanya Thnadel Movie: నాగ చైతన్య- సాయి పల్లవి కాంబోలో తండేల్ మూవీ రాబోతోంది. ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. కానీ, టీమ్ మాత్రం రిస్క్ తీసుకుంటోంది అంటున్నారు.

తండేల్ విషయంలో నాగ చైతన్య డేరింగ్ స్టెప్.. రిస్క్ తీసుకుంటున్నాడా?

అక్కినేని నాగచైతన్య.. ఈ యంగ్ హీరో నుంచి మూవీ వస్తోంది అంటే తెలుగు ఆడియన్స్ లో మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. కానీ, నాగ చైతన్య అభిమానులు మాత్రం సరైన హిట్టు కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తండేల్ మూవీ కరెక్ట్ సమాధానం అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. యదార్థ ఘటనల ఆధారంగా అనడంతోనే నాగచైతన్య మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నాడంటూ ప్రశంసలు మొదలయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో తండేల్ విషయంలో రిస్క్ తీసుకుంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

తండేల్ పై ఆడియన్స్ లో చాలానే అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో మరోసారి సాయి పల్లవితో జత కట్టడం కూడా ఈ హైప్ కి కారణగా చెప్పచ్చు. షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. యదార్థ ఘటనల ఆధారంగా కాబట్టి ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ మీద చాలానే రీసెర్చ్ చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్ అన్నీ మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి. లవ్ స్టోరీ మాత్రమే కాకుండా.. దేశభక్తి కోణం కూడా ఉంది కాబట్టి గట్టిగానే కొడతారని నమ్ముతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తండేల్ మేకర్స్ రిస్క్ తీసుకుంటున్నారు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

విషయం ఏంటంటే.. తండేల్ సినిమాని అక్టోబర్ 11న విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అవుతోందంట. అయితే అక్టోబర్ 10న దేవర సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇలాంటప్పుడు తండేల్ సినిమాని అక్టోబర్ 11న విడుదల చేయడం రిస్క్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా రెండు సినిమాలు దాదాపుగా ఒకే నేపథ్యం కలిగినవి. ఈ రెండు సినిమాల్లో సముద్రం బ్యాక్ డ్రాప్ లోనే కథ నడుస్తూ ఉంటుంది. దేవర పార్ట్ 1 సినిమాపై పాన్ ఇండియా లెవల్లో హైప్ క్రియేట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్టు తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ ఇది. నిజానికి ఈ చిత్రాన్ని మొదట అనుకున్న తేదీ నుంచి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, అప్పటికే అక్కడ పుష్ప పార్ట్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. కాబట్టి రిస్క్ తీసుకోకూడదు అని దేవర పార్ట్ 1ని అక్టోబర్ 10కి మార్చేశారు.

ఇప్పుడు దేవర మేకర్స్ నిర్ణయంతో తండేల్ మూవీకి రిస్క్ పెరిగింది అంటున్నారు. అయితే తండేల్ కూడా పాన్ ఇండియా లెవల్లోనే వస్తోంది. తారక్ తో పోటీ అంటే రిస్క్ ఏమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ తండేల్ మేకర్స్ రిస్క్ తీసుకుంటున్నారు అనలేం. వారి కథ మీద వారికి ఉన్న నమ్మకం కావచ్చు. అలాగే అది దసరా వీక్.. సినిమాలో విషయం ఉంటే ఆడియన్స్ వద్దన్నా థియేటర్లకు వస్తారు. దేవర సినిమా టాక్.. తండేల్ సినిమాపై ప్రభావం చూపించలేదు అనే చెప్పాలి. ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి ఆడియన్స్ తప్పకుండా టాక్ బాగుంటే రెండు సినిమాలు అయినా చూస్తారు. అంతవరకు తండేల్ టీమ్ అయితే రిస్క్ తీసుకుంటున్నారు అనుకోవట్లేదు. అవుట్ పుట్ మీద దృష్టి పెట్టి.. అనుకున్న రీతిలో సినిమాని పూర్తి చేయగలిగితే నాగ చైతన్య కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్టు అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. అక్టోబర్ 11న గనుక తండేల్ రిలీజ్ ఫిక్స్ చేస్తే.. రిస్క్ అంటారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి