iDreamPost

కళ్ళు చెదిరేలా ‘ప్రాజెక్ట్ k’ బిజినెస్.. ‘బాహుబలి 2’ కలెక్షన్లను మించి!

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ ఆయన రేంజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాల బిజినెస్ లు కళ్ళు చెదిరే స్థాయిలో జరుగుతున్నాయి.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ ఆయన రేంజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాల బిజినెస్ లు కళ్ళు చెదిరే స్థాయిలో జరుగుతున్నాయి.

కళ్ళు చెదిరేలా ‘ప్రాజెక్ట్ k’ బిజినెస్.. ‘బాహుబలి 2’ కలెక్షన్లను మించి!

బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్, మార్కెట్ ఏ స్థాయికి వెళ్లాయో తెలిసిందే. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ ఆయన రేంజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాల బిజినెస్ లు కళ్ళు చెదిరే స్థాయిలో జరుగుతున్నాయి.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నప్పటికీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ కె పైన అందరి దృష్టి నెలకొంది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్.. ప్రపంచస్థాయిలో సంచలనం సృష్టించడం ఖాయమని మూవీ టీమ్ నమ్మకంగా ఉంది. ఇదే నమ్మకాన్ని ఇండస్ట్రీ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అందుకేనేమో విడుదలకు ఇంకా చాలా నెలల సమయం ఉన్నా.. బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి.

వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశముంది. అంటే విడుదలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. కానీ సినిమా బిజినెస్ మాత్రం అప్పుడే జరిగిపోతుంది. ఈ మూవీ నైజాం రైట్స్ ను ఏషియన్ సునీల్ రూ.70 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత నైజాంలో ఆ స్థాయిలో బిజినెస్ చేసిన సినిమా ప్రాజెక్ట్-కె నే అవుతుంది. ఆర్ఆర్ఆర్ నైజాం రైట్స్ రూ.75 కోట్లకు అమ్ముడైనప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ చిత్రం నైజాంలో ఏకంగా రూ.110 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం రేపింది. అయితే ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. పైగా దర్శకుడు రాజమౌళి కాబట్టి ఆ స్థాయి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. కానీ ప్రాజెక్ట్ కె విషయంలో మాత్రం కేవలం ప్రభాస్ స్టార్ డమ్ తోనే ఆ స్థాయి బిజినెస్ జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాహుబలి 2 సినిమా నైజాంలో రూ.68 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ రాకముందు వరకు నైజాంలో అత్యధిక షేర్ రాబట్టిన రికార్డు బాహుబలి 2 పేరు మీదే ఉండేది. మరోవైపు ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు అందులో సగం కూడా రాబట్టలేకపోయాయి. సాహో 30 కోట్లకు, రాధేశ్యామ్ 25 కోట్లకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ ఆ ప్రభావం ప్రాజెక్ట్ కె బిజినెస్ పై కొంచెం కూడా చూపించట్లేదు అనిపిస్తోంది. మరి ఈ చిత్రం అందరి అంచనాలను నిజం చేస్తూ.. ఒక్క నైజాంలోనే వంద కోట్ల షేర్ రాబట్టి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి