iDreamPost

Naa Saami Ranga In OTT: OTTలోకి వచ్చేసిన ‘నా సామిరంగ’..ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Naa Saami Ranga OTT: అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నెల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాను ఎందులో చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Naa Saami Ranga OTT: అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నెల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమాను ఎందులో చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Naa Saami Ranga In OTT: OTTలోకి వచ్చేసిన ‘నా సామిరంగ’..ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఇటీవల కాలంలో సినీప్రియుల ఆలోచన ధోరణి మారిపోయింది. గతంలో థియేటర్లకు వెళ్లి మూవీస్ ను చూసేవారు. కానీ గత రెండేళ్ల నుంచి మాత్రం థియేటర్లతో పాటు ఓటీటీలోను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో ఓటీటీ హవా నడుస్తోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలు అతి తక్కువ సమయంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ప్రేక్షకులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక ఏ సినిమా ఎప్పుడు ఓటీటీలో  రిలీజ్ అవుతుందనే వార్తలు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి వీక్లీ వీక్లీ కొత్త కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. తాజాగా కింగ్ నాగార్జున నటించిన  నా సామిరంగ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మరి.. ఎందులో స్ట్రీమ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున విభిన్న చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇటీవలే ‘నా సామిరంగ’ అనే సినిమాతో  ప్రేక్షకులను పలకరించారు.  విలేజ్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా  సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది.  మలయాళం చిత్రమైన ‘పొరింజు మరియం జోస్’ అనే సినిమాకి రీమేక్ గా ఈ  చిత్రాన్ని తెరకెక్కించారు.  కొరియోగ్రాఫర్ గా పని చేసిన  విజయ్ బిన్ని  ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆయనకు ఇది తొలి సినిమా కావడం విశేషం. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా..తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యే మరోసారి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది.

జనవరి 14న  నా సామిరంగ థియేటర్లలో విడుదలైంది. అక్కడ ప్రేక్షకులను నుంచి మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో  ‘నా సామిరంగ’ అందుబాటులో ఉంది. ఇటీవల ఈ సినిమతో పాటు సంక్రాంతికి రిలీజైన మహేష్ గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్ సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున కూడా నా సామిరంగ తో ఓటీటీలోకి వచ్చేశారు. ఈ సినిమాలతో పాటు విడుదలైన హనుమాన్ సినిమా మాత్రం మార్చిలో ఓటీటీలోకి రాబోతుంది.

నా సామిరంగ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ నటించారు. అలానే  అల్లరి నరేష్, రాజ్ తరుణ్, నాజర్, షబీర్ కల్లరక్కల్, రుక్సార్ ధిల్లాన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చుట్టూరి  నా సామిరంగ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అవార్డు పొందిన ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. గతంలో సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాయి.

ఈ సంక్రాంతికి నా సామిరంగతో హ్యాట్రిక్ కొట్టారు నాగార్జున అక్కినేని. ఇక ఈ సినిమా విషయంలో మరో ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే.. ఇక ఈ సినిమాను కేవలం 3 నెలల్లోనే పూర్తి చేశారు. కొత్త దర్శకుడు ఇంత త్వరగా సినిమా తీసి సూపర్ హిట్ ఇవ్వడంతో అక్కినేని అభిమానులు తెగ ఖుషీ అయిపోయారు. ఇప్పటికే థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన అక్కినేని అభిమానులు, సినీ ప్రియులు..మరోసారి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి.. ఇంకెందు ఆలస్యం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి వెళ్లి.. నా సామిరంగను వీక్షించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి