iDreamPost

యాదాద్రి ఆలయానికి విరాళంగా 5 KGల బంగారం! ఆ భక్తుడు ఎవరో కాదు..

  • Author Soma Sekhar Published - 03:32 PM, Wed - 23 August 23
  • Author Soma Sekhar Published - 03:32 PM, Wed - 23 August 23
యాదాద్రి ఆలయానికి విరాళంగా 5 KGల బంగారం! ఆ భక్తుడు ఎవరో కాదు..

సాధారణంగా కోరిన కోరికలు తీరిస్తే.. దేవుళ్లకు మెుక్కులు చెల్లిస్తూ ఉంటారు భక్తులు. అందులో భాగంగానే భారీ స్థాయిలో విరాళాలు కూడా చెల్లిస్తుంటారు. అయితే ఎక్కువగా ఈ విరాళాలు బంగారం రూపంలో ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 5 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు ఓ భక్తుడు. ఆ భక్తుడు మరెవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, మై హోం గ్రూప్స్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు. ఇటీవల యాదాద్రి ఆలయాన్ని త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి సందర్శించారు. ఈ క్రమంలోనే ఆయన చేతుల మీదుగా.. బంగారాన్ని ఆలయ ఈవోకు అందజేశారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భారీ విరాళాన్ని అందజేశారు మై హోం గ్రూప్స్ సంస్థల అధిపతి జూపల్లి రామేశ్వరరావు. స్వామివారి ప్రధాన ఆలయ గర్బగుడిపై ఏర్పాటు చేసిన విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఏకంగా 5 కేజీల బంగారాన్ని ఆయన విరాళంగా అందజేశారు. ఆగస్టు 21న శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో స్వామివారిని దర్శించుకున్నారు జూపల్లి రామేశ్వరరావు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి చేతుల మీదుగా.. బంగారాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. మై హోం ఇండస్ట్రీస్ నుంచి 2 కేజీలు, మై హోం కన్ స్ట్రక్షన్స్ నుంచి 3 కేజీల గోల్డ్ ను విరాళంగా ఆయన విరాళంగా ఇచ్చారు.

అదీకాక స్వామివారి కళ్యాణ మండపాన్ని సొంత ఖర్చుతో నిర్మించనున్నట్లు రామేశ్వరరావు వెల్లడించారు. ఇక బంగారాన్ని విరాళంగా ఇవ్వడం ద్వారా ఆలయ పునఃనిర్మాణంలో భాగం కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం కొండపై నిర్మించే కళ్యాణ మండపానికి, టెంపుల్ సిటీలో ఏర్పాటు చేసే మఠం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. కాగా.. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ భావించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తన వంతుగా ఒక కేజీ 16 తులాల బంగారాన్ని కేసీఆర్ విరాళంగా ప్రకటించారు. భక్తులు కూడా విరాళం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీంతో చాలా మంది భక్తులు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా రామేశ్వరరావు 5 కేజీల బంగారాన్ని ఇవ్వడం జరిగింది.

ఇదికూడా చదవండి: చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి