iDreamPost

Uttar Pradesh: స్వర్గంలో ఉన్నానంటూ జైలు నుంచి ఇన్ స్టా లైవ్ ఇచ్చిన హత్యకేసు నిందితుడు!

  • Published Mar 16, 2024 | 4:34 PMUpdated Mar 16, 2024 | 4:34 PM

సాధారణంగా జైలుకు వెళ్లిన వ్యక్తి.. పశ్చాతాపంతోనో .. భయంతోనో ఉంటూ.. ఎవరికీ తన మొహం చూపించుకోడానికి కూడా ఇష్టపడడు. కానీ, హత్య కేసులో జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం.. జైలులో ఉండడం స్వర్గంలో ఉన్నట్లు ఉందంటూ.. ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా జైలుకు వెళ్లిన వ్యక్తి.. పశ్చాతాపంతోనో .. భయంతోనో ఉంటూ.. ఎవరికీ తన మొహం చూపించుకోడానికి కూడా ఇష్టపడడు. కానీ, హత్య కేసులో జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం.. జైలులో ఉండడం స్వర్గంలో ఉన్నట్లు ఉందంటూ.. ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Mar 16, 2024 | 4:34 PMUpdated Mar 16, 2024 | 4:34 PM
Uttar Pradesh: స్వర్గంలో ఉన్నానంటూ జైలు నుంచి ఇన్ స్టా లైవ్ ఇచ్చిన హత్యకేసు నిందితుడు!

సహజంగా జైలులో ఉన్న వ్యక్తులకు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవు. వారి వద్ద మొబైల్ ఫోన్స్ కూడా తీసేసుకుంటారు. ఇక వారు చేసిన తప్పులకు అనుగుణంగా.. జైలులో ఉండే ఖైదీలకు కఠిన శిక్షలను అమలు పరుస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. కానీ, తాజాగా హత్య కేసులో జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి మాత్రం.. జైలుకు వెళ్లడాన్ని విహార యాత్రకు వెళ్లినట్లుగా భావించాడో ఏమో.. సెంట్రల్ జైలులో ఉన్న ఆ వ్యక్తి .. ఇంస్టాగ్రామ్ లో లైవ్ ఇస్తూ . తాను జైలులో ఉంటే స్వర్గంలో ఉన్నట్టు ఉందని.. లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని.. అందరికి ఆశ్చర్యం కలిగించిన ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

2019 డిసెంబర్ 2వ తేదీన .. ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో.. రాకేష్ యాదవ్‌ అనే కాంట్రాక్టర్‌ను.. ఆసిఫ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ హత్య కేసులో ఆసిఫ్ ను అరెస్ట్ చేసి.. ఉత్తరప్రదేశ్ లోని.. బరేలీ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే , ఆ సెంట్రల్ జైలులో ఉన్న ఆ వ్యక్తి చేతికి ఫోన్ ఎలా చేరిందో తెలియదు కానీ.. జైలు నుంచి ఆ వ్యక్తి ఇంస్టాగ్రామ్ లో లైవ్ ఇచ్చిన ఓ వీడియో .. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 2 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో.. జైలు ఒక స్వర్గంలా ఉందని.. ఇక్కడ తానూ లైఫ్ ని చాలా బాగా ఆస్వాదిస్తున్నాని .. దేవుడి దయ ఉంది. అలాగే పెద్దల కరుణ కూడా ఉంది అంటూ .. త్వరలో తాను జైలు నుంచి బయటకు వస్తానని కూడా తెలిపాడు . ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. ఈ ఘటనపై అందరూ విమర్శలు కురిపిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి చేతికి ఫోన్ చేరడం .. కేవలం జైలు సిబ్బంది నిర్లక్ష్యమేనని అంతా అనుకుంటున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.

ఇక ఈ వీడియోపై.. హత్యకు గురైన రాకేష్‌ యాదవ్ తమ్ముడు.. జిల్లా మేజిస్ట్రేట్‌కు కంప్లైంట్ చేశాడు. జైలు నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు నిందుతుడికి అన్ని వసతులు కల్పిస్తున్నారని.. పేర్కొన్నాడు. దీనితో ఉన్నత అధికారులు.. ఈ విషయంపై పూర్తి విచారణ జరపాలని.. జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందంటూ.. పూర్తి విచారణ తర్వాత ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినా వారిపై . కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ.. యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్‌ కిశోర్‌ స్పందించారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి