iDreamPost

విషాదం నింపిన విహారం.. క్షణంలో అనాథలుగా మారిన చిన్నారులు!

  • Published Jul 16, 2023 | 4:23 PMUpdated Dec 19, 2023 | 3:32 PM

ఎవరి ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఎంతో సంతోషంగా బతికిన వారి జీవితాలు.. మరు నిమిషంలో రోడ్డున పడే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా.. ఎంతో మంది ఉన్నట్లుండి కుప్పకూలి మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.

ఎవరి ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఎంతో సంతోషంగా బతికిన వారి జీవితాలు.. మరు నిమిషంలో రోడ్డున పడే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా.. ఎంతో మంది ఉన్నట్లుండి కుప్పకూలి మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే.

  • Published Jul 16, 2023 | 4:23 PMUpdated Dec 19, 2023 | 3:32 PM
విషాదం నింపిన విహారం.. క్షణంలో అనాథలుగా మారిన చిన్నారులు!

కన్ను మూస్తే జననం.. కన్ను తెరిస్తే మరణం అంటారు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు.. ఎవరి ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. అప్పటి వరకు ఎంతో సంతోషంగా బతికిన వారి జీవితాలు.. మరు నిమిషంలో రోడ్డున పడే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా.. ఎంతో మంది ఉన్నట్లుండి కుప్పకూలి మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లారు. కానీ అప్పుడు వారికి తెలియదు.. ఆ విహారయాత్ర తమ జీవితాల్లో అంతులేని విషాదన్ని నింపుతుందని.. తమ జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన మహారాష్ట్ర, ముంబైలో చోటు చేసుకుంది. సముద్రతీరంలో సరదాగా గడుపుదామని.. ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్లింది. కానీ నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంతకు ఏం జరిగింది అంటే.. జ్యోతి సోనార్‌ అనే మహిళ సాగర తీరంలో ఎంజాయ్‌ చేయడం కోసం తన భర్త, పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. వారు ముందుగా జుహు చౌపట్టి వెళ్లాల్సి ఉండగా.. అక్కడ వాతావరణం బాగాలేదని.. సెక్యురిటీ సిబ్బంది జ్యోతి కుటుంబాన్ని అటువైపుగా వెళ్లకుండా ఆపారు. దాంతో జ్యోతి, తన భర్త కలిసి బ్యాండ్‌స్టాండ్‌ బాంద్రాకు వెళ్లారు.

సముద్రాన్ని, ఎగసిపడే అలలు, కెరటాలను చూస్తూ ఏంజాయ్‌ చేయసాగారు. ఈ క్రమంలో జ్యోతి తన భర్తతో కలిసి కొంచెం దూరం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఒక రాయి మీద కూర్చుని ఫొటోలకు ఫోజులు ఇవ్వసాగారు. అప్పటికే అక్కడ వాతావరణం కాస్త భయంకరంగానే ఉంది. కానీ జ్యోతి దంపుతులు అదేం పట్టించుకోకుండా ఫొటోలు దిగుతూ ఎంజాయ్‌ చేయసాగారు. భీకరమైన అలలు వచ్చి తాకుతున్న ఏమాత్రం భయం లేకుండా అలానే కూర్చున్నారు. ఈ క్రమంలో ఓ భారీ అల వచ్చి బలంగా ఢీకొట్టడంతో.. జ్యోతి భర్త అక్కడే పడిపోగా.. ఆమె మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. రెప్పపాటులో జ్యోతి ప్రపంచం నుంచి మాయమయ్యింది.

ఇది గమనించిన ఓ యువకుడు.. జ్యోతిని రక్షించే ప్రయత్నం చేయగా.. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో.. అతను కూడా కొట్టుకుపోయే ప్రమాదం తలెత్తింది. దాంతో మిగతా వారు వెంటనే స్పందించి.. ఆ యువకుడిని కాపాడగలిగారు. ఈ ప్రమాదంలో జ్యోతి గల్లంతయ్యింది. ఇక అంతసేపు తమ తల్లిదండ్రులను ఫొటోలు, వీడియోలు తీస్తూ.. బిజీగా ఉన్న జ్యోతి పిల్లలు.. కళ్ల ముందే తల్లి కొట్టుకుపోవడంతో.. భయంతో బిగుసుకుపోయారు. అమ్మా.. అమ్మా అంటూ అరుస్తూ అ‍త్యంత హృదయవిదారకంగా ఏడ్వడం అక్కడ ఉన్న వారిని కలిచి వేస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి