iDreamPost

రాముడిపై భక్తితో కాలినడకన అయోధ్యకు చేరిన ముస్లిం యువతి!

Young Muslim Girl who Reached Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాం లల్లాను దర్శించుకోవడానికి రోజు రోజుకీ భక్తుల తాకిడి పెరిగిపోతుంది. హిందూ, ముస్లిం ఇతర మతాల వారు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు.

Young Muslim Girl who Reached Ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాం లల్లాను దర్శించుకోవడానికి రోజు రోజుకీ భక్తుల తాకిడి పెరిగిపోతుంది. హిందూ, ముస్లిం ఇతర మతాల వారు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు.

రాముడిపై భక్తితో కాలినడకన అయోధ్యకు చేరిన ముస్లిం యువతి!

భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిరం ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహనికి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా  జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన మరుసటి రోజు నుంచి బాల రాముడి దర్శనానికి అనుమతి ఇచ్చారు. దీంతో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో బాల రాముడి దర్శించుకోవడానికి మతాలకు అతీతంగా భక్తులు తరలి వస్తున్నారు. స్వామి వారి దివ్య దర్శనం చేసుకొని తరలించిపోతున్నారు. తాజాగా రాముడి దర్శనం కోసం.. ఓ ముస్లిం యువతి తన సహచరులతో కలిసి ముంబై నుంచి కాలి నడకన అయోధ్యకు చేరుకొని భారత దేశ గొప్పతనాన్ని చాటి చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. రాం లల్లాను కళ్లారా చూసేందుక భక్తులు లక్షల సంఖ్యలో అయోధ్యకు తరలి వెళ్తున్నారు. అయితే రాముడి దర్శనానికి హిందువులే కాదు.. ముస్లిం, ఇతర మతాల వారు కూడా అయోధ్యకు చేరుకుంటున్నారు. బాల రాముడిని పూజించడానికి, ఆరాధించడానికి హిందువే కానక్కరలేదంటూ ఓ ముస్లిం యువతి ఏకంగా 1,425 కిలో మీటర్ల దూరం నుంచి కాలినడకన అయోధ్యకు చేరుకుంది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన షేక్ షబ్నం (23) ముస్లిం మతానికి చెందిన యువతి. ఈమె బీకాం విద్యార్థిని. షబ్నమ్ కి శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అయోధ్యలో రామ మందిరంలో కొలువై ఉన్న బాల రాముడి దర్శనం చేసుకోవాడానికి తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినిత్ పాండే, శుభమ్ గుప్తాలతో కలిసి ముంబై నుంచి అయోధ్యకు కాలి నడకన బయలుదేరింది.

ముంబై నుంచి అయోధ్యకు బయలుదేరిన షబ్నమ్ ఆమె సహచరుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షేక్ షబ్నం ప్రతిరోజూ పాతిక నుంచి ముప్పై కిలో మీటర వరకు నడిచినట్లు తెలిపింది. ఆమెకు సాయం చేయడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. అంతేకాదు ఆమె భద్రత కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.. భోజన, వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టకేలకు ఆమె అయోధ్య చేరుకుంది. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయోధ్యకు చేరుకున్న షబ్నం ఎంతో భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా షబ్నం మాట్లాడుతూ.. ‘శ్రీరాముడు పాటించిన విలువలు, ఆచరణ ఎందరికో స్ఫూర్తి.. చిన్నప్పటి నుంచి శ్రీరామ భక్తురాలిని, నా కల నిజం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాం లల్లాను దర్శించుకోబోతున్నా.. ఇది నా పూర్వజన్మ సుకృతం’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయోధ్యకు చేరుకున్న షబ్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి