iDreamPost

Multiplexes : సామాన్యుడికి సినిమా దూరమా దగ్గరా

Multiplexes : సామాన్యుడికి సినిమా దూరమా దగ్గరా

దేశంలో అతి పెద్ద మల్టీ ప్లెక్స్ చైన్స్ గా పేరొందిన పివిఆర్ ఐనాక్స్ లు చేతులు కలిపాయి. పరస్పర ఒప్పందంలో భాగంగా ఇండియా వైడ్ రెండింటికి కలిపి వచ్చే ఆదాయాన్ని పంచుకునే విషయంలో స్పష్టమైన నిబంధనలతో అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ప్రెస్ నోట్ ని సోషల్ మీడియాతో పాటు అన్ని ఛానల్స్ కు అందించారు. 350కి పైగా లొకేషన్లలో 1500 అంతకు మించి ఉన్న స్క్రీన్లన్నీ ఇప్పుడు ఒకే గొడుగు కిందకు వస్తాయి. హైదరాబాద్ తో సహా మెట్రో నగరాల్లో గణనీయమైన ఆదాయం ఉన్న ఈ రెండు కంపెనీలు ఒక్కటవ్వడం ద్వారా ఈ పరిశ్రమలో సరికొత్త మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మరో కోణం ఉంది. ఈ మెర్జర్ భవిష్యత్తులో మోనోపోలీకి దారి తీస్తుందని అభిప్రాయపడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే దాని వల్ల నిర్మాతలతో పాటు వినియోగదారులూ ఇబ్బంది పడతారని అంటున్నారు. ఇన్కమ్ షేరింగ్, టికెట్ ధరల వ్యవహారం, పర్సెంటేజ్ దందా ఇవన్నీ ప్రభావితం చెందే ప్రమాదం లేకపోలేదు. గతంలోనూ పలుమార్లు మల్టీప్లెక్సుల మొండి పట్టు వల్ల చిన్న సినిమాలు దెబ్బ తిన్న సందర్భాలున్నాయి. ప్రొడ్యూసర్లకు దక్కాల్సిన ఆదాయం రాకుండా పోయిన ఉదంతాలు జరిగాయి. మరి పివిఆర్ ఐనాక్స్ లు జంటగా మారిపోతున్న తరుణంలో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారా అంటే డౌటే

ఇప్పటికే థియేటర్ లో సినిమా చూడటం ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. టికెట్ 400 రూపాయలకు కొని అంతకంటే ఎక్కువ మొత్తం పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ లాంటి వాటికి ఖర్చు పెట్టాల్సి రావడం ఆడియన్స్ జేబులకు చిల్లులు పెడుతోంది. సౌకర్యాలు ఎంత ఘనంగా ఉన్నా వాటి పేరుతో మరీ ఇంత లాక్కోవడం సామాన్యుడిని హాలుకు దూరం చేస్తోంది. ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాయి. మరోవైపు సింగల్ స్క్రీన్ల కౌంట్ రాను రాను తగ్గిపోతోంది. ఇంకో పదేళ్ల తర్వాత వీటిని వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చేమో. అప్పుడు మల్టీప్లెక్స్ తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. అలా జరగడం మంచిది కాదు కూడా

Also Read : RRR 3 Days Collections : బాక్సాఫీస్ వద్ద రామ్ భీమ్ వసూళ్ల ప్రభంజనం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి