iDreamPost

రామ మందిర ప్రతిష్టాపన.. ఉద్యోగులకు శెలవు ప్రకటించిన అంబానీ!

ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న చారిత్రాత్మక ఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయోధ్యలోని రామ మందిర ప్రారంభం జరగనుంది. అందులో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఓ పండుగలా ఈ వేడుకను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో

ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న చారిత్రాత్మక ఘట్టానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. అయోధ్యలోని రామ మందిర ప్రారంభం జరగనుంది. అందులో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఓ పండుగలా ఈ వేడుకను చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో

రామ మందిర ప్రతిష్టాపన.. ఉద్యోగులకు శెలవు ప్రకటించిన అంబానీ!

యావత్ భారతావని భావోద్వేగాలతో పరవశించిపోనున్న సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని రామ మందిరం చరిత్రలో నిలిచిపోయే ఓ గొప్ప ఘట్టానికి నాంది కానుంది. దేశమంతా వినిపిస్తోన్నజై శ్రీరామ్ నినాదాలతో హిందూ భక్తులు పులకరించిపోతున్నారు. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ వేడుక జరగనుంది. ఎన్నో వైదిక ఆచారాలు నడుమ శ్రీరామునికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు పండితులు. అంగరంగ వైభవంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ పండుగలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అతిరధ మహారధులు ఈ వేడుకకు తరలివెళ్లనున్నారు.

శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సెలవు ప్రకటించాలని కొంత డిమాండ్లు వచ్చాయి. రామ మందిరం ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు ఒక రోజు సెలవు ఇవ్వాలని దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ.. ఆ రోజున ఉద్యోస్థులకు ఆఫ్ డే లీవ్ ప్రకటించింది. ఆలయ ప్రారంభోత్సవ ఘట్టాన్ని వీక్షించే వెసులు బాటును ఉద్యోగులకు కల్పించేందుకు మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు హాఫ్ డే లీవ్‌ను అనౌన్స్ చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ప్రైవేట్ సంస్థ కూడా ఆ రోజు పూర్తిగా సెలవు ప్రకటించింది.

ఇండియా అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. శ్రీరామ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జనవరి 22న తన ఉద్యోగులకు సెలవు మంజూరు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ వేడుకకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ సంస్థ పేర్కొంది. ఈ వేడుకకు ఆయన కుటుంబ సభ్యులతో సహా పాల్గొననున్నారు. కాగా, ఈ దేవాలయం నెలకొన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలువులు. అక్కడ బ్యాంకులు, మద్యం దుకాణాలు సైతం బంద్. అలాగే మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, హర్యానా, గోవా ప్రభుత్వాలు కూడా సెలవు ప్రకటించాయి. ఇతర రాష్ట్రాలు కొన్ని హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి