iDreamPost

Dhruv Jurel: అతడే నా ఇన్స్పిరేషన్.. ధృవ్ జురెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ధృవ్ జురెల్.. ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్. ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన రోల్ మోడల్ పేరును రివీల్ చేశాడు.

ధృవ్ జురెల్.. ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్. ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన రోల్ మోడల్ పేరును రివీల్ చేశాడు.

Dhruv Jurel: అతడే నా ఇన్స్పిరేషన్.. ధృవ్ జురెల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ధృవ్ జురెల్.. ప్రస్తుతం టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన ప్లేయర్. ఇంగ్లాండ్ తో జనవరి 25 నుంచి జరగనున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. తొలి రెండు మ్యాచ్ లకు భారత జట్టును ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ లో యూపీ యంగ్ ప్లేయర్, వికెట్ కీపర్ ధృవ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు ఈ కుర్రాడు. టీ20లు, వన్డేలకు కాకుండా డైరెక్ట్ గా సంప్రదాయ క్రికెట్ కు ఎంపిక కావడంతో.. అందరు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్ లో తన రోల్ మోడల్ ఎవరో చెప్పుకొచ్చాడు ఈ నయా సంచలనం. మరి ధృవ్ రోల్ మోడల్ ఎవరో.. ఇప్పుడు తెలుసుకుందాం.

గత కొంతకాలంగా మూడు ఫార్మాట్స్ లో టీమిండియా ప్రయోగాలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగా యువ ఆటగాళ్లకు ఛాన్స్ లు ఇస్తూ.. వారి సత్తాను పరీక్షించే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం, తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించింది టీమిండియా. ఈ జట్టులో 22 ఏళ్ల యూపీ నయా సంచలనం ధృవ్ జురెల్ చోటు దక్కించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారాడు ఈ యంగ్ ప్లేయర్. అయితే తాను క్రికెట్ లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అయిన ఆటగాడి పేరును చెప్పుకొచ్చాడు జురెల్. “నా ఇన్స్పిరేషన్ అండ్ నా రోల్ మోడల్ మహేంద్రసింగ్ ధోని” అంటూ ప్రముఖ వార్తా పత్రిక దైనిక్ జాగారన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఐపీఎల్ లో రాజస్తాన్ జట్టు తరఫున ఆడినప్పుడు చెన్నైతో మ్యాచ్ లో తన కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు జురెల్. ఆ మ్యాచ్ లో ధోనితో కలిసి ఆడటంతో పాటుగా 5 నిమిషాలు మాట్లాడాననని, ఆ క్షణాలు నా లైఫ్ లో మర్చిపోలేనివని జురెల్ తెలిపాడు. ఈ క్రమంలో ధోని నాకు కొన్ని సలహాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. కాగా.. 2023 ఐపీఎల్ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు ధృవ్. 13 మ్యాచ్ ఆడి 152 రన్స్ చేశాడు. అద్భుతమైన వికెట్ కీపింగ్ తో పాటుగా ఒత్తిడిని తట్టుకుని బ్యాటింగ్ చేస్తాడని ఓ సందర్భంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఇతడిపై ప్రశంసలు కురిపించాడు. మరి తన రోల్ మోడల్ ధోని అని చెప్పిన ధృవ్ జురెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి