iDreamPost

జాక్ పాట్ కొట్టిన మృణాల్ ఠాకూర్.. చేతిలో ఎన్ని మూవీస్ ఉన్నాయంటే!

  • Published Feb 09, 2024 | 11:41 AMUpdated Feb 09, 2024 | 11:41 AM

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ టాక్ సంపాదించుకుంటున్న హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇప్పుడు అందరి చూపు ఈ భామ మీదే ఉందంటూ .. ఇండస్ట్రీలో పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ టాక్ సంపాదించుకుంటున్న హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఇప్పుడు అందరి చూపు ఈ భామ మీదే ఉందంటూ .. ఇండస్ట్రీలో పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి.

  • Published Feb 09, 2024 | 11:41 AMUpdated Feb 09, 2024 | 11:41 AM
జాక్ పాట్ కొట్టిన మృణాల్ ఠాకూర్.. చేతిలో ఎన్ని మూవీస్ ఉన్నాయంటే!

సినీ ప్రపంచానికి భావమే కానీ భాషతో సంబంధం ఉండదు. అలా ఎక్కడెక్కడినుంచో వచ్చిన వారంతా .. ఈ రంగుల ప్రపంచంలో తమ ప్రతిభను చూపించి.. వారికంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి తెలుగు వారిని .. ఆ సెలెబ్రిటీలు వారి నటనతో మెప్పిస్తే చాలు.. ఇక వారికి అభిమానులుగా మారిపోతుంటారు తెలుగు ప్రేక్షకులు. అందులోను ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి .. తెలుగు వారి మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలా అందరిలానే మొదట బుల్లితెరపై అలరించి .. సీతారామం చిత్రంతో.. టాలీవుడ్ లో వెండితెరపై అడుగుపెట్టిన హీరోయిన్ “మృణాల్ ఠాకూర్”. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ భామ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తూనే ఉంది. అయితే, ఇప్పుడు అందరి చూపు ఈ అమ్మడి మీదే అంటూ .. పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో చూసేద్దాం.

మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేకంటే ముందు .. మొదట్లో పలు మరాఠీ, హింది చిత్రాల్లో కూడా నటించింది. కానీ, ఆ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ, టాలీవుడ్ లో సీతారామం సినిమా ఈ అమ్మడికి లక్కీ ఛాన్స్ అని చెప్పి తీరాలి. ఇక ఆ చిత్రంలో మృణాల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కసారిగా మృణాల్ స్థాయిని మార్చేసిన చిత్రం “సీతారామం”. ఇక ఆ తర్వాత రీసెంట్ గా “హాయ్ నాన్న” చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ . దీనితో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. హాయ్ నాన్న చిత్రం అయిన వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా .. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫ్యామిలి స్టార్” లో కూడా దర్శనం ఇచ్చింది మృణాల్. తాజాగా ఆ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్ లో మృణాల్ మరోసారి తన అందంతో అందరిని కట్టిపడేసింది. ఇక త్వరలో విడుదల కానున్న “ఫ్యామిలీ స్టార్” చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే .. ప్రస్తుతం అందరి కన్ను మృణాల్ మీదే ఉందంటూ .. మృణాల్ చేతిలో మరెన్నో భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మృణాల్ చేతిలో మూడు భారీ ఆఫర్లు ఉన్నాయని సమాచారం. అందులో ఒకటి ఏ ఆర్ మురుగుదాస్ శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో.. మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత శింబు హీరోగా నటించబోతున్న ఓ యాక్షన్ చిత్రంలో కూడా మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మైత్రి మూవీస్ నిర్మించబోతున్న ఓ చిత్రంలో కూడా మృణాల్ హీరోయిన్ గా నటించే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇలా, వరుస ఆఫర్లతో ప్రస్తుతం మృణాల్ బిజీగా ఉంది. మృణాల కనుక సరిగ్గా తనకు తగిన పాత్రలను ఎంచుకుంటే.. ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి నటిగా .. ఈ భామ గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి, ప్రస్తుతం మృణాల్ వరుస సినిమా ఆఫర్లపై వినిపిస్తున్న కథనాల విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి