iDreamPost

చేపలు ఇవ్వడమా..? పట్టడం నేర్పడమా..?

చేపలు ఇవ్వడమా..? పట్టడం నేర్పడమా..?

సహాయం చేసే సందర్భమే వస్తే ‘చేపలు ఇవ్వడాని కంటే, వాటిని పట్టడం నేర్పించాలని’ చెబుతుంటారు. ప్రతి సందర్భానికి రెండు కోణాలు ఉన్నట్లే ఇటువంటి సూచనలకు కూడా భిన్న కోణాలు ఉంటాయి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కావాల్సిన వారికి చేపలు పట్టడం నేర్పించొచ్చు. కానీ జవసత్వాలు ఉడిగి, వ్యవస్థలు సహకరించని పరిస్థితుల్లో ఉంటే ముందు చేపలే ఇవ్వాలి, ఆ తరువాత చేపలు పట్టే విధంగా సిద్ధం చేయాలి. ఇది వ్యక్తులకైనా వ్యవస్థలకైనా అన్వయించుకోవచ్చు. సరిగ్గా సీయం వైఎస్‌ జగన్‌ ఇదే చేస్తున్నారు.

సంవత్సరాల తరబడి జవసత్వాలు కోల్పోయిన వ్యవస్థలను పునరుద్దరించడంతోపాటు, ఆకలితో ఆలమటిస్తున్న జనాలకు ముందు ‘చేపలు’ పంచుతున్నారు. వారు శక్తి కూడగట్టుకుని సిద్దమయ్యే సమయానికి చేపలు పట్టే విధానాలను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం నవరత్నాల పేరుతో ప్రకటించిన పథకాల్లో దాదాపు 8 పథకాలు ఇప్పటికే అమల్లోకొచ్చాయి. ఇళ్ళ స్థలాలు కూడా రానున్న కొద్ది రోజుల్లోనే లబ్దిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

కాగా అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, విద్యా / వసతి దీవెన, పెన్షన్లు ఇలా అన్ని పథకాలు కూడా జనసామాన్యాన్ని ఆర్ధికంగా ఒక మెట్టుపైకి ఎక్కించేవే. మధ్య తరగతి నుంచి ప్రారంభించి పేదలు, నిరుపేదల వరకు పరిశీలిస్తే వారి వారి జీవితాల్లో ప్రస్తుతం జగన్‌ ప్రకటించి, అమలు చేస్తున్న పథకాల ప్రభావం ఎంతో ఉంటుందని తెలుస్తుంది. ఆయా వర్గాలను ఆర్ధికంగా, సామాజికంగా కృంగదీసే శక్తి విద్య, వైద్య రంగాలకు ఎంతుంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది.

సరిగ్గా ఇక్కడే జగన్‌ తన లక్ష్యాన్ని గురిపెట్టారు. ఉన్న పళంగా ప్రజల ఆర్ధిక/ సామాజిక స్థితిని దిగజార్చేవాటిని గుర్తించి వాటికి తన తోడ్పాటును అందిస్తున్నారు. దీంతో ఆయా వర్గాలు స్వేచ్ఛగా జీవించగలిగే వెసులుబాటును ప్రభుత్వపరంగా అందిస్తున్నారు. తద్వారా ఆర్ధివేత్తలు సూచించి ప్రజల ‘కొనుగోలు శక్తి’ని కాపాడగలుగుతున్నారు. తద్వారా మార్కెట్‌లో నగదు లభ్యతను నిలకడగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

దీని ప్రభావం విమర్శలకు కన్పించకపోవచ్చునేమోగాక, కానీ ఆర్ధికవేత్తలు మాత్రం తప్పకుండా గుర్తిస్తున్నారు. అయితే ఇటువంటి చర్యలు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే ఇస్తాయనే వారికి కూడా సమాధానం ఉంది. ఒకటిన్నర లక్షకుపైగా సచివాలయం ఉద్యోగులు, నాలుగు లక్షలకుపైగా వాలంటీర్లతో దాదాపు అయిదున్నర లక్షల వరకు ఉద్యోగాలు కల్పించి, ఆయా కుటుంబాలకు ఆర్ధికంగా స్థిరత్వం పొంందేందుకు అవకాశం ఏర్పరిచారు. తద్వారా యువత తమకాళ్లపై తాము నిలబడి, వారివారి కుటుంబాలకు ఆర్ధిక ఆసరగా ఉండేందుకు అవకాశం దక్కింది. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రజలకు స్ధిరమైన ఆర్ధిక భరోసా కల్పించడమేనని చెప్పాలి.

ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జవసత్వాలుడిగిన వ్యవస్థలకు చేపలనిచ్చి జవసత్వాలు కల్పించడంతో పాటు, భవిష్యత్తుకు మార్గనిర్దేశనం చేస్తూ ప్రజలకు చేపలు పట్టడం కూడా నేర్పిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి