iDreamPost

కరోనా ఉన్న తల్లితో పాటు 17 రోజులు క్వారంటైన్లో ఉన్నా ఆ నెలల బాలుడికి సోకని వైరస్.. ఎలా సాధ్యమైందంటే..?

కరోనా ఉన్న తల్లితో పాటు   17 రోజులు క్వారంటైన్లో ఉన్నా  ఆ  నెలల బాలుడికి  సోకని వైరస్.. ఎలా సాధ్యమైందంటే..?

కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే ఇళ్లలోనే ఉండండి. బయట తిరగకండి. ఎవరిని తాకండి. ఒకసారి ముట్టుకున్నా, వైరస్ ఉన్న వారిని ఒక్కసారి పట్టుకున్న, వారికి దగ్గరగా వెళ్ళినా వైరస్ సోకుతుంది..అని నిత్యం టీవీల్లోనూ, వైద్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. అయితే ఒక బాలుడు వైరస్ సోకిన తన తల్లితో 17 రోజులపాటు ఉన్న ఆ చిన్నారికి వైరస్ సోకకపోవడం గమనార్హం. కరోనా నుంచి సురక్షితంగా బాలుడు బయటపడడం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి కి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఓ మహిళకు వైరస్ వ్యాపించింది. ఆమెకు ఓ ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. ఆమె ను అధికారులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాబును చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి వద్ద ఉంచారు.

ఐసోలేషన్ లో ఉన్న తల్లి, బిడ్డల.. యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు ఆసుపత్రి వైద్యులు చూస్తూ వచ్చారు. బాబును తాకాల్సిన సమయం లో ఎలాంటి సురక్షితమైన పద్ధతులను అవలంభించాలో ఆ తల్లికి అవగాహన కల్పించారు. దాంతో పాటు 17 రోజుల పాటు వైద్యులు కంటికి రెప్పలా చూసుకోవడం వల్ల ఆ బాబుకు వైరస్ సోకలేదు. ఇద్దరికీ తరచుగా పరీక్షలు నిర్వహి స్తూ చికిత్స అందిస్తూ వచ్చారు.

రెండుసార్లు కరోనా పరీక్ష నిర్వహించిన ఫలితాలు నెగిటివ్ రావడంతో శనివారం ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 17 రోజుల పాటు కరోనా సోకిన తల్లి తో గడిపిన చిన్నారి సురక్షితంగా బయటకు రావడంతో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది వయసున్న బాబులో వైరస్ తట్టుకోగలిగే శక్తి ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఐసీఎంఆర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి