iDreamPost
android-app
ios-app

చాట్ జీపీటీలో ఫోటో ఎడిటింగ్ సహా అనేక ప్రయోజనాలు! నాలెడ్జ్ అవసరం లేదు..

  • Published Jun 18, 2024 | 4:40 PM Updated Updated Jun 18, 2024 | 4:40 PM

ChatGPT Photo Edit Feature: చాట్ జీపీటీలో లేటెస్ట్ అప్డేట్ ని గమనించారా? దీన్ని మీరు అస్సలు ఊహించి ఉండరు. కొత్తగా వచ్చిన అప్డేట్ తో ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. అలానే ఫోటోలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ChatGPT Photo Edit Feature: చాట్ జీపీటీలో లేటెస్ట్ అప్డేట్ ని గమనించారా? దీన్ని మీరు అస్సలు ఊహించి ఉండరు. కొత్తగా వచ్చిన అప్డేట్ తో ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. అలానే ఫోటోలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

చాట్ జీపీటీలో ఫోటో ఎడిటింగ్ సహా అనేక ప్రయోజనాలు! నాలెడ్జ్ అవసరం లేదు..

చాట్ జీపీటీ ప్రస్తుతం ఒక సంచలనం. ఎలాంటి సమాచారం కావాలన్నా గానీ ఇట్టే అందిస్తుంది. కెమెరా ముందు అందంగా కనిపించడానికి మంచి అవుట్ ఫిట్ ఎంపిక చేయమంటే చేస్తుంది. పర్సనల్ వెబ్ పేజ్ క్రియేట్ చేయమంటే దానికి తగ్గ సమాచారం ఇస్తుంది. చదువుకోవడం కోసం సహాయం చేస్తుంది. యూట్యూబ్ షార్ట్స్ కోసం లేదా ఇన్ స్టా రీల్స్ కోసం కంటెంట్ కావాలన్నా.. స్టోరీస్ కావాలన్నా ఇస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో మరొక అద్భుతమైన అప్డేట్ వచ్చింది. అదే ఇమేజ్ బేస్డ్ ఏఐ టూల్. దీని ద్వారా ఒక ఇమేజ్ ని చాట్ బాట్ లో అప్లోడ్ చేసి దాని గురించి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. ఆ ఇమేజ్ లో ఎవరున్నారు? అనే వివరాలు తెలుసుకోవచ్చు. మేము ఈ చాట్ జీపీటీ ఇమేజ్ ఏఐ టూల్ ని టెస్ట్ చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. 

కల్కి పోస్టర్ లో ఉన్నది ఎవరు?:

చాట్ జీపీటీలో కల్కి పోస్టర్ ని అప్లోడ్ చేసి సినిమా పేరు ఏంటి? అందులో ఉన్నది ఎవరు? అనే వివరాలు అడగ్గా వెంటనే కరెక్ట్ సమాధానమిచ్చింది. పోస్టర్ లో ఉన్న నటుల పొజిషన్ తో సహా వారి పేర్లు ఇచ్చింది. సినిమా పేరు కూడా చెప్పింది. 

Photo editing in chat GPT

కలర్ మార్పు:

అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా ఇమేజ్ ని టైటిల్ లేకుండా ప్లెయిన్ గా చాట్ జీపీటీలో అప్ లోడ్ చేశాం. ఆ ఇమేజ్ రంగుని మార్చమని అడగ్గా 10 సెకన్లలో వేరే రంగు ఇమేజ్ ని ఇచ్చింది. కల్కి పోస్టర్ ని అప్లోడ్ చేసి బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చమని అడగ్గా వెంటనే బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చి ఇచ్చింది.  

Photo editing in chat GPT

చాట్ జీపీటీ ఇమేజ్ అప్డేట్ ప్రయోజనాలు:

మీరు ఇమేజ్ ని ప్రొఫెషనల్ గా కాకపోయినా బేసిక్ లెవల్ లో ఎడిట్ చేసుకోవచ్చు. కలర్ మార్పులు, బ్లాక్ అండ్ వైట్ కన్వర్షన్ వంటివి చేసుకోవచ్చు. ఫోటోషాప్ లో అయినంత ప్రొఫెషనల్ గా రాదు కానీ ఒకవేళ మీరు ఇమేజ్ ని ఫోటోషాప్ రేంజ్ లో రావాలి అని కోరుకుంటే కనుక వేరే ఆల్టర్నేటివ్ స్టెప్స్ ని చెప్తుంది. కాన్వాలోకి వెళ్లి ఎలా డిజైన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చెబుతుంది. ఇక మీ దగ్గర ఉన్న ఫోటోలో ఉన్నది ఎవరో తెలియకపోతే కనుక ఈ చాట్ జీపీటీ లోకి ఇమేజ్ అప్లోడ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలానే ఒక ఫోన్ ఏ కంపెనీకి చెందినదో మీకు తెలియదు. దాన్ని మీరు చాట్ జీపీటీలో ఏ కంపెనీ ఫోన్ అనేది తెలుసుకోవచ్చు. 

ఇలా ఇమేజ్ సెర్చింగ్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ నుంచి టెక్స్ట్ ని, ఒక ప్రాజెక్ట్ లో ఉన్న విజువల్ కంటెంట్ ని వివరించడం వంటివి ఈ చాట్ జీపీటీ చాలా సమర్థవంతంగా చేస్తుంది. చాట్ జీపీటీలో ఉన్న ఈ అద్భుతమైన ఫీచర్స్ ని ఉపయోగించుకోవాలంటే కనుక మీరు సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాలి. ప్లస్ ప్లాన్ నెలకు 20 డాలర్స్ ఉంటుంది. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 1670 రూపాయలు. ఒక టీమ్ కి కావాలనుకుంటే ఒక్కో పర్సన్ కి 25 డాలర్స్ పడుతుంది. మన కరెన్సీ ప్రకారం 2085 రూపాయలు పడుతుంది.  

ఇమేజ్ అప్లోడ్ చేయడం ఎలా?:

చాట్ జీపీటీ.కామ్ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు ఒక చాట్ విండో ఓపెన్ అవుతుంది. అందులో ఎడమ వైపున క్లిప్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఆ ఇమేజ్ నుంచి మీరు ఎలాంటి సమాచారం పొందాలనుకుంటున్నారో దాన్ని మీరు చాట్ జీపీటీని ఇంగ్లిష్ లో అడగాలి. అలా అడిగిన కొన్ని సెకన్లకి మీకు ఫలితాలను ఇస్తుంది. ఫ్రీ వెర్షన్ లో లిమిట్ ఉంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 

చాట్ జీపీటీని ట్రై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.