iDreamPost

నటుడి మరణం.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని కుటుంబ సభ్యులు!

తరచూ సినీ పరిశ్రమల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరికి అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మరికొందరు మాత్రం అనాథ శవాల్లా మిగిలిపోతుంటారు. అలాంటి విషాద ఘటన ఓ నటుడి విషయంలో జరిగింది.

తరచూ సినీ పరిశ్రమల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కొందరికి అంత్యక్రియలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మరికొందరు మాత్రం అనాథ శవాల్లా మిగిలిపోతుంటారు. అలాంటి విషాద ఘటన ఓ నటుడి విషయంలో జరిగింది.

నటుడి మరణం.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాని కుటుంబ సభ్యులు!

సినీ పరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచమని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. బయటకు చిరునవ్వుతో కనిపించే నటీనటుల  వెనుక కన్నీటి కథలు కూడా ఉంటాయి. ఫేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే వారి చుట్టూ అందరూ చేరుతారు. చేతి నిండ డబ్బులు ఉండి.. వరుస సినిమా ఆఫర్లతో ఉంటే.. అందరూ చుట్టూ చేరుతారు. ఇక డబ్బులు లేక అవకాశాలు లేకపోతే.. బంధువులే దూరం పెట్టేస్తారు. అలా ఎందరో నటీనటులు అనాథలుగా మరణించారు. తాజాగా ఓ నటుడికి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. చివరకు అనాథ శవంలా ఆ నటుడి అంత్యక్రియలు జరిగాయి.

మలయాళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కె.డి. జార్జ్ అనారోగ్యంతో డిసెంబర్ 19న మరణించాడు. అయితే ఆయనను చివరిసారి చూసేందుకు, అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు రాలేదు.  రెండు వారాలుగా మార్చురీలోనే ఆయన శవం కుళ్లి పోతోంది. చివరకు తోటి డబ్బింగ్ ఆర్టిస్టు, ఆర్టిస్ట్ యూనియన్ చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని సంప్రదించింది.  ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం జోక్యంతో దాదాపు 16 రోజుల తరువాత.. సంక్రాంతి పండగ రోజే ఆయన  అంత్యక్రియలు జరిపారు.

ఇక ఆయన మృతిపై పలువురు నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత జి.శిబు..జార్జ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గంభీరమైన కంఠంతో మాట్లాడే అతడి స్వరాన్ని ఇట్టే గుర్తు పట్టొచ్చని అన్నారు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు గడించాడని, తనకు చెన్నైలో సొంతిల్లు కూడా ఉందని, కానీ అక్కడి వెళ్లాడానికి డబ్బులేదని ఆయన చెప్పినట్లు శిబు పేర్కొన్నారు. సినిమాల ద్వారా తనకు పెద్దగా డబ్బులు వచ్చేవి కావు, సొంతింటికి వెళ్లి జీవించాలనే కోరిక అలాగే మిగిలిపోయిందని ఆయన తెలిపారు.

ఇక జార్జ్ కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. వివిధ సంస్థలు చేసిన సాయంతో కోవిడ్ టైమ్ లో బతుకు బండిని లాగించాడు.  ఆ తరువాత పలు సినిమాలో పని చేశాడు. చివరగా డిసెంబర్ 27న  అనారోగ్యంతో  ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. వెంటనే డబ్బింగ్ ఆర్టిస్ యూనియన్ తో మాట్లాడి.. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను కోరారు. వెంటనే ఆయనను ఐసీయూలోకి మార్చి..బతికించే ప్రయత్నం చేసిన విఫలమైంది. చివరకు కేడీ జార్జ్ కన్నుమూశారు.

డిసెంబర్ 29న చనిపోయిన ఆయనను చూసేందుకు ఎవ్వరూ రాలేదు. బంధువులు, కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు రాలేదు. 16 రోజులపైనే అనాథ శవంలా మార్చురీలో ఉండిపోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు జార్జ్ మృతదేహానికి జనవరి 15న అంత్యక్రియలు నిర్వహించారు. జార్జ్ అంత్యక్రియలకు సంబంధించిన పై విషయాలను నిర్మాత శిబు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి